Justice Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 2021, ఏప్రిల్ 24వ తేదీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది.

Justice Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం

Supreme court

Justice NV Ramana Chief Justice of India: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 2021, ఏప్రిల్ 24వ తేదీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. శనివారం ఉదయం 11 గంటలకు 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్‌ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశముంది.

1957 ఆగస్టు 27న ఏపీలోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సీజేఐగా ఎన్‌.వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నందున స్వగ్రామంలో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ జస్టిస్‌గా పదవీ విరమణ చేసిన బోబ్డేతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఎన్వీ రమణ. బోబ్డే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో బోబ్డేకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.

Read More : Kumbh Mela : కుంభమేళాకు వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి