Supriya Sule: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ‘అమితాబ్ బచ్చన్’ అంటూ చమత్కరించిన సుప్రియా సూలే

ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు.

Supriya Sule: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ‘అమితాబ్ బచ్చన్’ అంటూ చమత్కరించిన సుప్రియా సూలే

Ajit Pawar and Supriya Sule

NCP Power Politics: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో అమితాబ్ బచ్చన్ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తరువాత తొలిసారిగా ముంబైలోని ఎన్సీపీ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నాంటూ వస్తున్న వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. అజిత్ పవార్ అమితాబ్ బచ్చన్ లాంటి వారు. మెగాస్టార్ అంటే అందరికీ ఇష్టమే. ఎక్కడికైనా వెళ్తాడు. ప్రజలు అతని ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. అతనితో సెల్ఫీలు తీసుకుంటారంటూ సుప్రీయా సూలే చెప్పారు. గతకొద్ది కాలంగా అజిత్ పవార్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. దీనికితోడు ఇటీవల ఎన్సీపీ అధినేత ప్రకటించిన పార్టీ పదవుల్లో అజిత్ కు చోటు దక్కలేదు.

Madhya pradesh Bus-Truck Collision: మధ్యప్రదేశ్‌లో బస్సు-ట్రక్కు ఢీ, ముగ్గురి మృతి ఏడుగురికి తీవ్ర గాయాలు

అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. మోదీ కృషివల్లనే చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని చెప్పారు. శుక్రవారం జల్‌గావ్‍‌లోని అమల్‌నేర్‌లో జరిగిన ఎన్సీపీ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయ్ హయాంలోకూడా బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. దేశంలో ఒకప్పుడు ఇందిరా గాంధీ, నెహ్రూలకు ఉన్న చరిష్మా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఉందని అన్నారు. గతంలోనూ మోదీపై అజిత్ ప్రశంసల జల్లు కురిపించిన విషయం విధితమే.

Ajit Pawar: 11వ క్లాసు వరకు ప్యాంటే వేసుకోలేదు.. గుడిలో డ్రెస్ కోడ్‭పై అజిత్ పవార్ హాట్ కామెంట్స్

మరోవైపు మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పవార్ ఆరోపించారు. అధికారుల బదిలీ రేట్లు ఫిక్స్ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తమవుతోందని, షిండే మంత్రివర్గంలో నిర్దేశించిన 43 మంది మంత్రులకు 20 మంది మాత్రమే ఉన్నందున ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.