Bhola Shankar: చిరు మూవీలో ఛాన్స్ కొట్టేసిన సుశాంత్.. ఆ పాత్రలో కనిపిస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరు మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తరువాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో భోళాశంకర్ మూవీ కూడా ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

Bhola Shankar: చిరు మూవీలో ఛాన్స్ కొట్టేసిన సుశాంత్.. ఆ పాత్రలో కనిపిస్తాడా?

Sushant To Star In Chiranjeevi Bhola Shankar Movie

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరు మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తరువాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో భోళాశంకర్ మూవీ కూడా ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా, తమిళ చిత్రం ‘వేదాలం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రానుంది.

Bhola Shankar : భారీ కలకత్తా సెట్‌లో మొదలుపెట్టేసిన భోళాశంకర్.. వాల్తేరు వీరయ్య రిటర్న్ టు సెట్స్..

ఈ సినిమాలో చిరు మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా జాయిన్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరో సుశాంత్ తనదైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ చిత్రంలోనూ సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజతో పాటు సుశాంత్ పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Bholashankar : సమ్మర్‎లో రిలీజ్ డౌటే అంటున్న ఫ్యాన్స్..

ఇప్పుడు భోళాశంకర్ సినిమాలో సుశాంత్‌కు ఓ మంచి పాత్ర దక్కినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడి పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడట. అయితే తమిళంలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ, తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర నిడివిని పెంచినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 18న ఈ మేరకు ప్రకటన చేస్తారనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.