Tamil Star Hero’s: తమిళ తంబీల బిగ్ గేమ్.. వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్

కొవిడ్ తర్వాత కోలీవుడ్ లో విజయ్ మాస్టర్, రజనీ అన్నాత్తే సినిమాలే కమర్షియల్ హిట్ కొట్టాయి. అయితే ఈ సినిమాలు తమిళ్ ఆడియెన్స్ కు తప్ప మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కాలేదు.

Tamil Star Hero’s: తమిళ తంబీల బిగ్ గేమ్.. వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్

Tamil Star Hero's

Tamil Star Hero’s: కొవిడ్ తర్వాత కోలీవుడ్ లో విజయ్ మాస్టర్, రజనీ అన్నాత్తే సినిమాలే కమర్షియల్ హిట్ కొట్టాయి. అయితే ఈ సినిమాలు తమిళ్ ఆడియెన్స్ కు తప్ప మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కాలేదు. టాలీవుడ్ లో చిన్నవో, పెద్దవో వరుసగా సినిమాలొస్తున్నా.. దీనికి భిన్నంగా తమిళ్ ఇండస్ట్రీ కనిపిస్తుంది. అయితే, 2022లో బిగ్ స్టార్స్ అందరూ కలిసి బిగ్ గేమ్ షురూ చేస్తూ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది కోలీవుడ్ ఇండస్ట్రీ.

Bheemla Nayak: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. సంక్రాంతి టార్గెట్ అందుకుంటాడా?

అజిత్, సూర్య, విజయ్ కొత్త సినిమాల మేకర్స్ హాట్ డెసిషన్స్ తీసుకున్నారు. తమిళ్ ఆడియెన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న వలిమై.. సంక్రాంతి రేస్ నుంచి తగ్గేలా కనిపించడం లేదు. తెలుగు సినిమాలు ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంటే.. కోలీవుడ్ లో పోటీ ఇచ్చేందుకు సంక్రాంతికి అజిత్ సినిమాను తీసుకొస్తున్నాడు నిర్మాత బోనీకపూర్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ పై మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

Bangarraju: వాసివాడి తస్సదియ్యా టీజర్.. చిట్టితో అక్కినేని హీరోల అల్లరి డాన్స్!

నిజానికి 2021 సంక్రాంతికి ఫస్ట్ స్టేప్ తీసుకున్నట్టే.. 2022 పండక్కి విజయ్ బీస్ట్ గా కనిపిద్దామనుకున్నాడు. కానీ ఆ స్పేస్ అజిత్ కిచ్చి సమ్మర్ కి రెడీ అవుతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న బీస్ట్ యమా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డేకి తమిళ్ ఇండస్ట్రీలో కమ్ బ్యాక్ ఫిల్మ్ గా బీస్ట్ వెల్కమ్ చెప్తోంది. తమిళ్, తెలుగు భాషల్లో ఏప్రిల్ లో బీస్ట్ రిలీజ్ అంటున్నారు. అది ఫిక్సయితే.. అదే నెల్లో రాబోతున్న సర్కారు వారి పాట, కేజీఎఫ్ 2 వంటి ప్రాజెక్ట్స్ తో టప్ ఫైట్ తప్పదు.

Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెన‌డియ‌న్ బ్యూటీ!

సూర్య ఏకంగా చిరూ ఆచార్యతోనే ఢీకొట్టబోతున్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ హీరో చేస్తోన్న ఎదర్కుమ్ తునిందవన్ మూవీ ఫిబ్రవరి 4న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదే డేట్ ను ఆచార్య ముందే లాక్ చేసుకుంది. సూర్య సినిమా అంటే ఖచ్చితంగా తెలుగు రిలీజ్ ఉంటుంది. మరి మెగాస్టార్ తో పోటీ తప్పేలా లేదు. అప్పటికి మార్పులు ఉంటుందో లేదో కానీ ఇప్పటికైతే తమిళ తంబీల సినిమాలకు మిగతా బాషల హీరోల సినిమాలతో పోటీ తప్పడం లేదు.