Team India : వ‌న్డేల్లో టీమిండియా ప్రపంచ రికార్డ్‌

భారత్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.. ఇక అంతే కాదు రెండోవన్డే విజయంతో పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది.

Team India : వ‌న్డేల్లో టీమిండియా ప్రపంచ రికార్డ్‌

Team India

Team India : భారత్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇక మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్.. ఇక అంతే కాదు రెండోవన్డే విజయంతో పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది.

శ్రీలంకపై మంగళవారం జరిగిన మ్యాచ్ లో విజయంతో భారత్, ఆ దేశంపై 93 విజయాలు సాధించింది. దీంతో భారత్ జట్టు కొత్త రికార్డును క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా 92 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఈ రికార్డును అధిగమించింది.

ఇక వ్య‌క్తిగ‌త రికార్డుల విష‌యానికి వ‌స్తే దీప‌క్ చ‌హ‌ర్ చేసిన 69 ప‌రుగులు ఇండియా త‌ర‌ఫున‌ ఎనిమిద‌వ నంబ‌ర్ బ్యాట్స్‌మ‌న్ చేసిన రెండో అత్య‌ధిక ప‌రుగులు కావ‌డం విశేషం. ఇతనికంటే ముందు 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీఫైన‌ల్లో ర‌వీంద్ర జడేజా ఇదే స్థానంలో బ్యాటింగ్ కి వ‌చ్చి 77 ప‌రుగులు చేశాడు.

ఇక భువ‌నేశ్వ‌ర్‌తో క‌లిసి దీప‌క్ చ‌హ‌ర్ నెల‌కొల్పిన 84 ప‌రుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా త‌ర‌ఫున రెండో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌. 2017లో భువ‌నేశ్వ‌రే ధోనీతో క‌లిసి శ్రీలంక‌పైనే 8వ వికెట్‌కు 100 ప‌రుగుల పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పాడు.