CM KCR : మోదీ.. అవివేక, అసమర్థత పాలన : సీఎం కేసీఆర్

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ ప్రశ్నించ లేదా అని నిలదీశారు. ఓ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలని ఉందని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. నేను కూడా ఓ ముఖ్యమంత్రిగా ఎందుకు రూపాయి పతనమౌతుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు.

CM KCR : మోదీ.. అవివేక, అసమర్థత పాలన : సీఎం కేసీఆర్

Kcr Fire Mod

CM KCR criticized : బీజేపీ, ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని విమర్శించారు. మోదీ.. అవివేక, అసమర్థత పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. సభలో ప్రధాని ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారో దేవుడికే ఎరుకన్నారు. ‘కేంద్ర మంత్రులు నన్ను తిట్టారు తప్ప.. ఏం లేదు… మేం అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదు’ అని అన్నారు.

యశ్వంత్ సిన్హా రావడం, బీజేపీ సభ అనుకోకుండా ఒకే రోజు జరిగాయని చెప్పారు. ‘ఆ రోజు నేను ప్రధానిని కొన్ని ప్రశ్నలు అడిగానని చెప్పారు. నేను ప్రజలకు సంబంధించిన ప్రశ్నలే అడిగా.. వ్యక్తిగతమైనవి కావు’ అని అన్నారు. తన ప్రశ్నలకు మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా సమాధానం చెప్పలేదన్నారు. బీజేపీ నేతల వద్ద సరుకు లేదు.. సంగతి లేదన్నారు. సమాధానం చెప్పలేం, అశక్తులమని బీజేపీ నేతలు నిరూపించారని పేర్కొన్నారు.

CM KCR : ‘నరేంద్రమోదీని తరిమి.. తరిమి కొట్టాలి’.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ ప్రశ్నించ లేదా అని నిలదీశారు. ఓ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలని ఉందని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. నేను కూడా ఓ ముఖ్యమంత్రిగా ఎందుకు రూపాయి పతనమౌతుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీపై లేదా అని అడిగారు. ముఖ్యమంత్రిగా మోదీ అడగొచ్చు కానీ… నేను అడగ కూడదా అని అన్నారు. రూపాయి విలువ రూ.80లకు ఎందుకు పడిపోయిందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

రూపాయి విలువ ఇంత స్థాయిలో ఎప్పుడైనా దిగజారిందా? అని అన్నారు. 8 ఏళ్ల పాలనలో దేశానికి బీజేపీ చేసిన ఒక్కటైనా మంచి పని ఉందా అని ప్రశ్నించారు. మంచినీరు ఇచ్చే తెలివి కూడా బీజేపీకి లేదన్నారు. దేశాభివృద్ధికి అవసరమైన వ్యూహం బీజేపీ దగ్గర లేదన్నారు. తెలంగాణకే కాదు దేశానికి కూడా బీజేపీ ఏమీ చేయలేదని పేర్కొన్నారు.