CM KCR : ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌..నెల రోజుల వ్యవధిలో రెండోసారి

నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండోసారి ఢిల్లీ వెళ్లారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సీఎం మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.

CM KCR : ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌..నెల రోజుల వ్యవధిలో రెండోసారి

Kcr (2)

CM KCR Delhi Tour : నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండోసారి ఢిల్లీ వెళ్లారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ … సీఎం మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి.. జలవివాదాలపై చర్చించనున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌.

ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. మరోసారి హస్తినలో మకాం వేశారు. గతంలో 9 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి పలు అంశాలపై చర్చించారు కేసీఆర్. తాజా పర్యటనలో ఏపీతో జల వివాదాలు, ధాన్యం కొనుగోలు వంటి సమస్యలను వీలయినంత త్వరగా పరిష్కరించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరనున్నారు.

TSSPDCL Warns : ఆ నెంబర్‌కు కాల్ చేయొద్దు, విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక

శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాకు నీటిని తరలించకుండా అడ్డుకోవాలని జలశక్తిశాఖ మంత్రిని కోరనున్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు పూర్తిస్థాయి అధికారాలు కల్పిస్తూ ఇచ్చిన గెజిట్ పైనా మరోసారి చర్చించే అవకాశం ఉంది.

ఆదివారం విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు అమిత్ షా. శాంతి భద్రతల పరిరక్షణ, తీవ్రవాదం కట్టడి, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు

Telangana : ఏపీ వదిలేస్తా..తెలంగాణకు వస్తా – జేసీ దివాకర్ రెడ్డి

అటు ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీకానున్నారు కేసీఆర్. బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై సీఎం చర్చించనున్నారు.మరోవైపు రాష్ట్ర సమస్యలతో పాటు…రాజకీయ అంశాలపైనా సీఎం దృష్టిపెట్టనున్నట్టు సమాచారం.