Drugs Case: డ్రగ్స్ కేసుపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. రేపే తీర్పు!

డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు పోలీసులు.

Drugs Case: డ్రగ్స్ కేసుపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. రేపే తీర్పు!

Drugs Case

Drugs Case: డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించలేదు. అయితే, వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు పోలీసులు.

వ్యాపారవేత్తలను పూర్తిస్థాయిలో విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు పోలీసులు. వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించని నాంపల్లి కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు.

డ్రగ్స్ కేసులో అరెస్టైనవారిని విచారించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. కీలక నిందితుడు టోనీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించామని పీపీ చెబుతున్నారు. నిందితుడు కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్స్, వాట్సప్ మెస్సేజ్‌లను స్వాధీనం చేసుకున్నామని, వాటి ద్వారా కేసు విచారిస్తున్నట్లు చెప్పారు.

Minister Kapil Patil: మటన్ రూ.700,పిజ్జా కోసం రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటారు : కేంద్ర మంత్రి

సెక్షన్ 27 ప్రకారం డ్రగ్స్ వినియోగదారులపై కేసులు నమోదు చేసినట్లు చెబుతుండగా.. సెక్షన్ 27 అనేది బెయిలబుల్ అఫెన్స్ అని, అందులో కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని వ్యాపారవేత్తల తరపు న్యాయవాదులు చెబుతున్నారు.

ఈ కేసులో అరెస్ట్‌లు జరిగినా కూడా ఎలాంటి పురోగతి లేదని, నిందితులందరికి బెయిల్ మంజూరు చేయాలని వ్యాపార వేత్తల తరపు న్యాయవాదులు కోరారు.

అరెస్ట్ అయిన వారందరు కేవలం కస్టమర్లు మాత్రమేనని, వ్యాపార వేత్తల తరపు న్యాయవాదులు చెప్పగా.. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.