Telangana Jobs : పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్.. జీవోలు సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో తొలి అడుగు పడింది. తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

Telangana Jobs : పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్.. జీవోలు సిద్ధం

Cm Kcr On Paddy Procurement

Telangana Jobs Notification : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో తొలి అడుగు పడింది. తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2022, మార్చి 23వ తేదీ బుధవారం శాఖల వారీగా జీవోలను టీఎస్ ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తొలి విడుత పోస్టుల భర్తీకి ఆర్థిఖ శాఖ నిర్ణయానికి నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్

ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 91 వేల 142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో వెల్లడించిన సీఎం కేసీఆర్.. వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని, పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read More : Telangana Jobs : క్యాడర్, జోన్, మల్టీ జోన్లవారీగా పోస్టుల వివరాలు

అంతేగాకుండా..11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్ లకు పాలాభిషేకం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియచేశారు నిరుద్యోగులు. తెలంగాణ భవన్ లో సీట్లు పంచుకుని.. సంబరాలు చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని ఓయూ జేఏసీ సంబరాలు జరుపుకున్నారు.