Jagadish Reddy-kishan Reddy : దేశానికి గర్వంగా చెప్పుకునే ఒక్క ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా..?

దేశానికి గర్వంగా చెప్పుకునేఒక్క ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా..? కేసీఆర్ నిప్పు..బీజేపీ నాయ‌కులు కేసీఆర్ ను ముట్టుకుంటే మ‌సై పోతార‌ని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు

Jagadish Reddy-kishan Reddy : దేశానికి గర్వంగా చెప్పుకునే ఒక్క ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా..?

Jagadish Reddy Kishan Reddy

jagadish reddy fire on Union Minister kishan reddy : తెలంగాణ రాష్టంలో గులాబీ దళానికి కాషాయ దళానికి మధ్య ఉప్పు నిప్పులా ఉంది. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. గులాబీ దళ నేత సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత గులాబీ నేత బీజేపీపై మాటల తూటాలు పేలుస్తున్నారు. కేసీఆర్ విమర్శలకు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఎదురు సమాధానాలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కుటుంబ పాలన అని..అతనికి కుటుంబమేముఖ్యం కానీ బీజేపీకి దేశం ముఖ్యం అంటూ కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు.

ఈక్రమంలో గులాబీ నేతలు మాత్రం ఊరుకుంటారా ఏంటీ..బండి సంజయ్ మీదా కిషన్ రెడ్డి మీద తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ నిప్పు.. బీజేపీ నాయ‌కులు కేసీఆర్ ను ముట్టుకుంటే మ‌సై పోతార‌ని హెచ్చరించారు. ప్రధాని మోదీ గొప్ప పాలన చేస్తున్నారని గప్పాలు కొట్టే బీజేపీ నేతలు మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని సవాల్ చేశారు. దేశానికి గర్వంగా చెప్పుకునే ఒక్క ప్రాజెక్టు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా? అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని మండిప‌డ్డారు.

విద్యుత్ సంస్కరణల పై సీఎం కేసీఆర్ చేసిన వాదన తప్పు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటున్నారు. కాదని మేం అంటున్నాం. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విషయంపై అబద్దాలు ఆడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఏప్రిల్ 27, 2021 నాడు విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దశల వారిగా అన్ని రంగాల్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ఆ పాలసీలో స్పష్టంగా ఉంది. ఆర్థిక సహాయానికి కేంద్రం విద్యుత్ సంస్కరణలతో ముడి పెట్టింది. కేంద్రం చెప్పినట్టుగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోక పోవడం వల్ల తెలంగాణ ఏటా రూ. 5 వేల కోట్లు న‌ష్ట‌పోతుంద‌ని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మీటర్లు పెట్టిన వారికి, ప్రైవేట్ పరం చేసిన వారికి కేంద్రం సాయం చేస్తోందంటూ తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్రంలో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అని జ‌గ‌దీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.

కేసీఆర్ భాష గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగాం ఉంద‌ని..బీజేపీ నేతలు ఎలాంటి భాష వాడుతున్నారో కిషన్ రెడ్డికి వినిపించటంలేదా? తెలయటంలేదా? అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ ఎందుకు? కిషన్ రెడ్డితో చర్చ అంటూ టీఆర్ఎస్ కార్యకర్త కూడా అవసరం లేదని ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మోడీ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదు అని మంత్రి విమర్శలు సంధించారు.