Telangana Politics : ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ సర్కార్ ని బొంద పెట్టటం ఖాయం 

ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టటం ఖాయం అంటూ మరోసారి కేసీఆర్ పై విరుచుకపడ్డారు ఈటల రాజేందర్. ఎన్నికల‌ తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని ఈటల జోస్యం చెప్పారు.

Telangana Politics : ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ సర్కార్ ని బొంద పెట్టటం ఖాయం 

Etala Rajender Criticized Cm Kcr

Telangana Politics :  సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టటం ఖాయం అని..ఎన్నికల‌ తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని జోస్యం చెప్పారు ఈటల. పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లు పరిశీలించిన సందర్భంగా మీడియాతో ఈటల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ 20వ రాష్ట్రంకానుందిని తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ ను ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారని..ప్రజల సొత్తును తన పార్టీ సొమ్ముగా వాడుకుంటున్నారంటూ విమర్శించారు.

Also read : Etela Rajender land scam :ఈటల భూకబ్జా నిజమేనని నిర్ధారణ..అసలు హక్కుదారులకు భూములు పంచాలని ప్రభుత్వం నిర్ణయం

33కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి నగరంలో హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని..కేసీఆర్ ముఖం చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడటంలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటల. ప్రజలకు ముఖం చూపించే ధైర్యం లేని కేసీఆర్ ఫ్లెక్సీలు మాత్రం పెట్టించుకుంటారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ పై ప్రజలకు వ్యతిరేకత ఎంతగా పెరిగిదంటే..కేసీఆర్ వార్త వస్తుంటే ప్రజలు టీవీలు ఛానల్స్ బంద్ చేసేంతగా ఉందని అన్నారు. బీజేపీ పండుగకు.. కేసీఆర్ సంబురాలు చేసుకోవటం సిగ్గుచేటని..తెలంగాణలో చెల్లని కేసీఆర్ ముఖం మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాల్ లో చెల్లుతుందా? తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతాడా? అని ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు.

ప్రజా ధనాన్ని కేసీఆర్ దోచుకోవటం వలనే.. ప్రభుత్వ ఖజానా మొత్తం దివాలా తీసిందని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. ప్రచార పిచ్చితో ఇతర రాష్ట్రాల్లో హార్డింగ్స్ కోసం కేసీఆర్ 250కోట్లు ఖర్చు చేశారని ఆరోపించిన ఈటల ఇదంతా ప్రజాధనం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాధనంతో తన ఇంట్లో పండుగ చేసుకునే కేసీఆర్ ప్రభుత్వానికి త్వరలోనే బీజేపీ చరమగీతం పాడుతుందని అన్నారు.

కాగా..టీఆర్ఎస్ మాజీ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ భూముల్ని అసలైన హక్కుదారులకు పంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈటల కుటుంబం చేతిలో ఉన్న భూములు ఎట్టకేలకు అసలు హక్కుదారులకు చేరనున్నాయి. ఈటల చేసిన భూ కబ్జా కేసుపై విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు కబ్జా జరగటం నిజమేనని తేల్చారు. అధికారులు చేపట్టిన ఈ విచారణలో రెండు గ్రామాలకు పరిధిలోని మొత్తం 85.19 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. ఈటల భార్య జమున హాచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లుగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు.

దీనిపై స్పందించిన ఈటల భార్య జమున ‘ తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని..కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు.  సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదని..కేసీఆర్‌ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఈటల జమున ఆరోపించారు.