Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 733 కోవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,82,336కి చేరింది.

Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 733 కోవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,82,336కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 4వేల 106కి పెరిగింది.

కరోనా బారి నుంచి ఒక్కరోజులో 2వేల 850 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15వేల 636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 56వేల 487 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గురువారంతో(767) పోలిస్తే శుక్రవారం కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది.

WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

ఏపీలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,166 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 9వేల 632మంది కరోనా నుంచి కోలుకున్నారు.

అటు దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా.. 58,077 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. 24 గంటల వ్యవధిలో మరణాలు కూడా భారీగా తగ్గాయి. ముందురోజు 1,200 పైగా మరణాలు నమోదుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 657గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది.

అటు తాజాగా దేశవ్యాప్తంగా 1,50,407 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,97,802 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 48,18,867 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకూ 171 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Melt Fat : ఈ 10 ఆహారాలతో కొవ్వు కరిగించేయండి!…

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముగింపు దశకు చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు క్రమంగా అదుపులోకి రావడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.07 లక్షల మంది చనిపోయారు.