Karnataka Politics: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న కర్ణాటక ప్రభుత్వం.. ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు
ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది

Free Bus: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన) జూన్ 11వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం అన్ని కులాలు, మతాలు, తరగతులకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూడాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రులు శాసనసభ్యులను ఆదేశాలు జారీ చేశారు.
Manipur Violence: మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు.. విచారణ వేగవంతం చేసిన సీబీఐ
ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు జిల్లా ఇన్ఛార్జ్లుగా మంత్రులను నియమించారు. ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు కొత్తగా నియమితులైన జిల్లా మంత్రులందరూ కార్యాచరణలోకి దిగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ప్రముఖుల సమక్షంలో ఆదివారం విధానసౌధ ఆవరణ నుంచి సీఎం సిద్దరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రచారం.. ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద BMTC మినహా మిగిలిన మూడు రవాణా కార్పొరేషన్లలో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేశారు.
Digital India Bill: ఇంటర్నెట్పై కేంద్రం కఠిన ఆంక్షలు.. 11 అంశాలతో కొత్తగా డిజిటల్ ఇండియా బిల్లు
అదనంగా జీరో టికెట్/శక్తి స్మార్ట్ కార్డ్ డేటా ఆధారంగా రవాణా ఏజెన్సీలు చేసే ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఇక మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరం ఆధారంగా రోడ్డు రవాణా సంస్థకు రీయింబర్స్మెంట్ అవుతుంది. అయితే ఈ పథకం ఏసీ, లగ్జరీ బస్సులకు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కర్ణాటక పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే కర్ణాటక బస్సుల్లో కానీ, కర్ణాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సుల్లో కానీ అనుమతి ఉండదు.