Movie Releases: ఈ వారం థియేటర్లలో ఒక్కటే సినిమా.. ఓటీటీలో డజనుకుపైనే!

ఈ మధ్య రిలీజ్ ల కోసం పోటీపడి వరసగా ధియేటర్లోకొచ్చిన సినిమాలు ఈ వీక్ కాస్త రిలాక్స్ అయ్యాయి. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్దగా సినిమాల మధ్యపోటీ లేదు. అందుకే ఈ గ్యాప్ ని..

Movie Releases: ఈ వారం థియేటర్లలో ఒక్కటే సినిమా.. ఓటీటీలో డజనుకుపైనే!

Movie Releases: ఈ మధ్య రిలీజ్ ల కోసం పోటీపడి వరసగా ధియేటర్లోకొచ్చిన సినిమాలు ఈ వీక్ కాస్త రిలాక్స్ అయ్యాయి. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్దగా సినిమాల మధ్యపోటీ లేదు. అందుకే ఈ గ్యాప్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నాయి ఓటీటీలు. స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కు రెడీగా లేకపోవడంతో ఈ వారం ధియేటర్లో రిలీజ్ సందడి కాస్త తక్కువే కనిపించబోతోంది. ఫిబ్రవరి 18న రిలీజ్ కు రెడీ అవుతున్న సీనియర్ హీరో మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా తప్పించి.. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. మోహన్ బాబు చాలా కాలం తర్వాత సోలో పర్ ఫామెన్స్ తో పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో చేస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫిబ్రవరి 18న ధియేటర్లోకొస్తోంది.

DJ Tillu: థియేటర్లలో డీజే రీసౌండ్.. కలెక్షన్ల మోతమోగిస్తున్న టిల్లు

ఫిబ్రవరి 18న ఓటీటీలో మాత్రం తెలుగులో మాంచి ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. తెలుగులో రెండు ఇంట్రస్టింగ్ సినిమాలు ఓటటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. క్రికెట్ కాన్సెప్ట్ తో ఇండియా వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్న 83 సినిమా ఫిబ్రవరి 18న డిస్నీహాట్ స్టార్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. అదే రోజు నాగార్జున, నాగచైతన్య కలిసి సంక్రాంతికి సూపర్ హిట్ ఇచ్చిన బంగార్రాజుతో జీ5 ఓటీటీ ద్వారా ఆడియనస్ ముందకు మరోసారి రాబోతున్నారు.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

18న క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఇరాయ్ సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. విశాల్ హీరోగా ధియేటర్లో రిలీజ్ అయిన ఎనిమీ సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ లో సోనీ లివ్ లో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే ఇంట్రస్టింగ్ సినిమాలు పెద్దగా లేకపోవడంతో మూవీ లవర్స్ ఓటీటీ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇదే మంచి టైమ్ చూసుకుని ఫిబ్రవరి 17 నుంచే ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి ఓటీటీలు. గురువారం యామి గౌతమ్ పిల్లల్ని హైజాక్ చేసే ఇంట్రస్టింగ్ రోల్ ప్లే చేసిన ఎ థర్స్ డే అనే థ్రిల్లర్ మూవీ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది.

Bigg Boss OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ప్రోమో రిలీజ్

ఈవారం ఓటీటీలో అన్నీ విమెన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. హ్యూమా ఖురేషి లీడ్ రోల్ లో డ్రామా ధ్రిల్లర్ గా తెరకెక్కిన సిరీస్ మిధ్య.. హిందీలో జీ 5లో రిలీజ్ కాబోతోంది. మరో హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్ ప్లే చేసిన బెస్ట్ సెల్లర్ అన సిరీస్ రిలీజ్ కాబోతోంది. ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ చూజ్ చేసుకునే శృతి హాసన్ ఈసారి కూడా ఓటీటీలో అదే సెలక్ట్ చేసుకుంది. ధ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ క్రేజీ సిరీస్ హిందీలో ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

వీటితో పాటు ఫిబ్రవరి 17న ఫ్యామిలీ ప్యాక్ అనే కన్నడ మూవీ అమెజాన్ లో, రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన మళయాళ మూవీ హృదయం డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్ అవుతున్నాయి. హార్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కిన టెక్సాస్ చైన్ సా, హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 18న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ద మార్వెల్ మిసెస్ మైజెల్ సీజన్ 4 అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 18న స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.