Bandi Sanjay : పక్కా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం-బండి సంజయ్

ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)

Bandi Sanjay : పక్కా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం-బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఎన్నికల వేడి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారింది. ఇరు పార్టీల నేతల ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, బీజేపీ గెలుపు పక్కా అని ఆయన జోస్యం చెప్పారు.

Also Read..Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి.. మంత్రి కేటీఆర్ ను విచారించాలి : రేవంత్ రెడ్డి

” కొన్ని కారణాల వల్ల నడ్డా రాలేకపోయారు. మరోసారి వస్తా అన్నారు. జేపీ నడ్డా, మోడీ నాయకత్వంలో దేశంలోనే బీజేపీ అతి శక్తిమంతమైన పార్టీగా అవతరించింది. తెలంగాణలో కాషాయపు రాజ్యం రావాలి. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో ఏ ఉపఎన్నిక అయినా బీజేపీ గెలుస్తుంది.(Bandi Sanjay)

ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్ పాలిటిక్స్ చేస్తోంది. కేసీఆర్ కొడుకు ట్విటర్ టిల్లుని ఉరికించి కొడతారు. మోదీని బ్రోకర్ అంటావా. నువ్వు బ్రోకర్ నీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్.
మళ్ళీ ఇక్కడ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మునుగోడులో పోలింగ్ ఏజెంట్లు దొరకని పార్టీ బీఆర్ఎస్.

30లక్షల మంది భవిష్యత్ నాశనం:
TSPSCలో 30లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే మీ అయ్య ఎందుకు మాట్లాడలేదు. TSPSC బోర్డును రద్దు చేయాలి. నీ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ జడ్జి విచారణతో జరిపించాలి. నాపైన పరువు నష్టం దావా వేశారు. ట్విట్టర్ టిల్లు, లిక్కర్ క్వీన్, హ్యాపీ రావు, అగ్గిపెట్టె రావు వల్లే తెలంగాణ నాశనం అవుతోంది. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తాం. కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తాం” అని బండి సంజయ్ అన్నారు.

Also Read..Wyra: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

మరోవైపు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ నూతన కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. సంగారెడ్డితోపాటు జనగామ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, అనంతపురం, చిత్తూరు జిల్లాల కార్యాలయాలను సైతం ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా ప్రారంభించారు జేపీ నడ్డా. సంగారెడ్డి జిల్లా నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. బండి సంజయ్ తోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సహ ఇంఛార్జ్ అరవింద్ మీనన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Bandi Sanjay)

భూపాలపల్లి బీజేపీ భవన ప్రారంభోత్సవంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహనరావు హాజరయ్యారు. జనగామ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.