Paddy Procurement Row : తెలంగాణ.. భారత్‌లో భాగం కాదా? ఎందుకీ వివక్ష..? కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం

తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేసేవరకు..(Paddy Procurement Row )

Paddy Procurement Row : తెలంగాణ.. భారత్‌లో భాగం కాదా? ఎందుకీ వివక్ష..? కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం

Paddy Procurement

Paddy Procurement Row : టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో లేదనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ, లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారని వాపోయారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున పంట ఎలా పండుతుందని వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో ముందు మీరు నూకలు తినండి అంటూ కేంద్రమంత్రి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై చివరివరకూ పోరాడదామని సీఎం కేసీఆర్ చెప్పారని నామా నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం 8ఏళ్లుగా ఒక్క పాఠశాల కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం దుర్మార్గంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఎంపీ నామా ఆరోపించారు.(Paddy Procurement Row )

Telangana : ‘ఉగాది తర్వాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం.. డెడ్‌లైన్‌ ఫిక్స్‌.. కౌంట్‌ డౌన్‌ స్టార్ట్’ ఢిల్లీలో రచ్చకు TRS రెడీ

తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర మంత్రులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆహారభద్రత చట్టం ఏమైందని నిలదీశారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడతామని, రైతులకు అండగా నిలబడతామని మంత్రి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేయండి అని అడిగేందుకు వెళితే.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీలో మమ్మల్ని ఘోరంగా అవమానించారని, కనీసం సమస్యలు వినేందుకు కూడా కేంద్ర మంత్రి సమయం ఇవ్వలేదని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు.

రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వాపోయారు. బీజేపీ నేతలు తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. న్యాయ బద్దంగా రావాల్సిన వాటా కూడా రాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఇద్దరు కార్పొరేట్ శక్తుల కోసమే ఈ దేశం అన్నట్లుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

తెలంగాణ‌లో పండిన ధాన్యాన్ని… కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కొంటారో లేదో అనే విషయంపై దేశ రాజధాని ఢిల్లీలోనే తేల్చుకుంటాం అంటున్నారు గులాబీ నేతలు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాది రైతులు సంవత్సరానికి పైగా ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి తరహాలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి తెలంగాణ ప్రభుత్వం సైతం ఉద్యమం చేయటానికి రెడీ అవుతోంది.

Telangana : పండిన ధాన్యం కొనమంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు

ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనాలంటూ గ్రామాలు, మండలాల స్థాయిలో తీర్మానాలు కూడా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.