TS Group-2: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

మంగళవారం సాయంత్రం పరీక్షల తేదీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని 782 గ్రూప్-2 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

TS Group-2: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

TS Group-2: తెలంగాణలో నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్-2 పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పరీక్షల తేదీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరుగుతుంది.

Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని 782 గ్రూప్-2 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో చేపట్టనున్న గ్రూప్-1, గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 5 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుండగా, జూలై 1న గ్రూప్-4 పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి గత డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదలకాగా, జనవరి 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ పోస్టుల కోసం మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి సగటున 705 మంది పోటీ పడుతున్నారు.