Rahul Bhat: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి Two terrorists killed in the encounter

Rahul Bhat: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి

తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జమ్మూ-కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Rahul Bhat: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి

Rahul Bhat: తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జమ్మూ-కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మరణించిన ముగ్గురు తీవ్రవాదుల్లో ఇద్దరు, నిన్న కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్‪ను కాల్చి చంపిన వాళ్లే కావడం గమనార్హం. గత బుధవారం కూడా కాశ్మీర్‌లో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది మరణించగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ ఇద్దరు తీవ్రవాదులు మరణించారు.

 

వీళ్లు పాకిస్తాన్‌లోని లష్కరే తయిబా సంస్థకు చెందిన తీవ్రవాదులుగా గుర్తించారు పోలీసులు. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న రాహుల్ భట్‌ను తీవ్రవాదులు గురువారం కాల్చి చంపారు. దీనిపై కాశ్మీరీ పండిట్‌లు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

×