Hijab Row : హిజాబ్ వివాదంపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..!

హిజాబ్‌ వివాదంపై ఎట్టకేలకు బీజేపీ అగ్రనేతల..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నోరు విప్పారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Hijab Row : హిజాబ్ వివాదంపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..!

Hijab Row..amit Shah

Hijab Row..Minister Amit Shah: దాదాపు నెల రోజుల నుంచి కర్ణాటకలో హిజాబ్‌ వివాదం చెలరేగింది. ఇది కాస్తా పక్క రాష్ట్రాలకు పాకటం..రాజకీయ రగడగా మారటం నేతలు ఎవరికి తోచింది వారు మాట్లాడటం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకే హిజాబ్ వివాదంపై బీజేపీ అగ్రనాయకులు నోరు విప్పలేదు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా ఎట్టకేలకు స్పందించారు. ఇన్నాళ్టికి నోరు విప్పిన అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం ధరించి మాత్రమే వెళితే మంచిది’అంటూ వ్యాఖ్యానించారు. ఇకా అమిత్ షా మాట్లాడుతూ.. “అన్ని మతాల వారు స్కూల్ డ్రెస్ కోడ్‌ని అంగీకరించాలని నా వ్యక్తిగత నమ్మకం.ఈ సమస్య ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు ఈ అంశంపై విచారణను నిర్వహిస్తోంది. ధర్మాసనం హిజాబ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అనుసరించాలి’ అని అమిత్ షా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

Also read : HiJab Row : ప్రకాశం జిల్లాకు పాకిన ‘హిజాబ్’సెగ..వికాశ్,చైతన్య స్కూళ్లలో విద్యార్ధినులను అడ్డుకున్న యాజమాన్యం

‘విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం ధరించి స్కూలుకు రావడానికే నేను మద్దతిస్తాను. దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలను అంగీకరించాల్సిందే. అయితే ఇది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఒకవేళ న్యాయస్థానం గనక తీర్పు వెలువరించాక నా నిర్ణయంలో ఏమైనా మార్పు రావొచ్చు. కోర్టు తీర్పులను ఎవరైనా గౌరవించాల్సిందే. దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా’ అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అని అమిత్‌షా అన్నారు.

ఇదిలా ఉంటే హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరోపక్క ప్రభుత్వం విషయం చూస్తే..విద్యార్థులు హిజాబ్‌ ధరించి రావడం నిషేధంపై ఏమాత్రం తగ్గటలేదు. తాము చెప్పినట్లుగా జరిగి తీరాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. హిజాబ్ విషయంలో తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటోంది.

Also read : Hijab Row In AP: ఏపీకి పాకిన హిజాబ్ వివాదం..విద్యార్థినిలను అడ్డుకున్న విజయవాడ లయోల కాలేజీ యాజమాన్యం

కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం పక్క రాష్ట్రాలకు పాకటంతో పాటు ఈ వివాదంపై అంతర్జాతీయ నేతలు కూడా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా కర్ణాటకలో మూతపడిన కళాశాలలు, విద్యా సంస్థలు తెరుచుకున్నా తిరిగి అదే పరిస్థితి ఉంది. కర్ణాటక హైకోర్టులో హిజాబ్‌ పై విచారణ కొనసాగుతుండగానే దేశంలోని పలు ప్రాంతాల్లోనూ హిజాబ్‌ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బీజేపీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈక్రమంలో మంత్రి అమిత్ షా మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా ఉండేలా వ్యాఖ్యానించారు.

Hijab Row: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’