Uttar Pradesh Election 2022 : యూపీ ఐదో విడత పోలింగ్ రేపే.. 61 స్థానాలు, 692 మంది అభ్యర్థులు

12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఇందుకు అధికారుల అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 692 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి...

Uttar Pradesh Election 2022 : యూపీ ఐదో విడత పోలింగ్ రేపే.. 61 స్థానాలు, 692 మంది అభ్యర్థులు

Elections In Uttar Pradesh

UP Fifth Phase Election Polling : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి చూపు యూపీపైనే ఉంది. 2024 జరుగనున్న సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్ గా భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితంపై కాషాయ దళం భారీ ఆశలు పెట్టుకుంది. దేశంలోనే యూపీలో అత్యధిక ఎంపీ స్థానాలున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అన్నీ పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఏడు దశల్లో జరిగే పోలింగ్… ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. ఐదో విడత పోలింగ్ 2022, ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం జరుగనుంది.

Read More : UP Election 2022: యూపీలో పోలింగ్ శాతం ఏం చెబుతోంది.. అధికార మార్పు జరుగుతుందా?

12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఇందుకు అధికారుల అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 692 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 24 లక్షల మంది ఓటర్లున్నారు. ఐదో దశలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు ప్రముఖులున్నారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఆరాధన మిశ్రా పోటీలో ఉన్నారు.

Read More : UP Election 2022: యూపీలో దళితులే కింగ్ మేకర్స్.. బీఎస్‌పీ మ్యాజిక్ చేస్తుందా? పూర్తి లెక్కలు ఇవే!

మంకాపూర్ నుంచి రమాపతి శాస్త్రి, అలాహాబాద్ వెస్ట్ నుంచి సిద్ధార్థ నాథ్ సింగ్, ప్రతాప్ గఢ్ నియోజవకర్గం నుంచి రాజేంద్ర సింగ్, అలహాబాద్ సౌత్ నుంచి గుప్తానాడి..తో పాటు ఇతరులున్నారు. మార్చి 03, 07 తేదీల్లో 6, 7వ విడుతల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ కు కంచుకోటలుగా భావించే అమేథీ రాయ్ బరేలీ జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సుల్తాన్ పూర్, అయోధ్య, ప్రతాప్ గఢ్, కౌశాంబి, బారాబంకి, శ్రావస్తి, గోండా, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్ జిల్లాల్లో పోలింగ్ జరుగనుంది.