Uttar Pradesh: రైల్వే స్టేషన్ల పేర్లు మారుస్తున్న యోగి ప్రభుత్వం

ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌గా మార్చేసింది యూపీ సర్కారు.

Uttar Pradesh: రైల్వే స్టేషన్ల పేర్లు మారుస్తున్న యోగి ప్రభుత్వం

Jhansi

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రైల్వే స్టేషన్ల పేర్లు మారుస్తొన్న యూపీ సర్కారు లేటెస్ట్‌గా ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌గా మార్చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేరును మార్చే ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో మొగల్ సరాయ్ రైల్వేస్టేషన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వేస్టేషన్‌గా మార్చగా.. అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ అని మార్చింది. అంతేకాదు.. సుల్తాన్‌పూర్, మీర్జాపూర్, అలీఘడ్, ఫిరోజాబాద్, మెయిన్‌పురిచ ఘాజీపూర్, బస్తీపూర్ రైల్వేస్టేషన్ల పేర్లను కూడా మార్చాలని యూపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

రైల్వేస్టేషన్ పేరు మార్చడం కోసం, ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరు మార్చాలని మూడు నెలల క్రితమే హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన చేసింది యూపీ ప్రభుత్వం.

ఇప్పుడు ఆ ప్రతిపాదనను ఆమోదించగా.. ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌గా మార్పు అయ్యింది. రైల్వే స్టేషన్ కోడ్ కూడా మారనుంది. స్టేషన్ పేరు మార్చడం వల్ల కూడా ఈ ప్రాంతంలో పర్యాటక అవకాశాలు పెరుగనున్నాయి.