Vaccination Vans : హైదరాబాద్‌లో ఇక వ్యాక్సినేషన్ వ్యాన్లు!

ఇకపై కరోనా టీకా కోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. ఎక్కడెక్కడో తిరగాలసిన పని లేదు. సులభంగా వ్యాక్సిన్ లభించనుంది...

Vaccination Vans : హైదరాబాద్‌లో ఇక వ్యాక్సినేషన్ వ్యాన్లు!

Vaccination Vans

Vaccination Vans : కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రజలందరికి వ్యాక్సిన్లు ఇవ్వాలని నిపుణులు స్పష్టం చేశారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ లు ముమ్మరం చేశాయి. ప్రజలందరికి టీకాలు వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు తీసుకొచ్చింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ వ్యాన్లను వైద్యారోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మొబైల్‌ వ్యాక్సినేషన్‌ వ్యాన్లు పనిచేస్తాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 100 మొబైల్‌ వ్యాక్సినేషన్‌ వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యారోగ్య శాఖ చేపట్టనుంది. వ్యాక్సినేషన్ వ్యాన్ల కోసం 040-2111 11111 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. 18ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88వేల 164 శాంపిల్స్ పరీక్షించగా 482 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,50,835కు చేరింది. 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,833కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 455 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,38,865కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 8,137 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 19, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 5, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 61, ఖమ్మం 26, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 7, మంచిర్యాల 13, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 6, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 35, నారాయణపేట 3, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 25, సిరిసిల్ల 13, రంగారెడ్డి 25, సిద్దిపేట 11, సంగారెడ్డి 6, సూర్యాపేట 17, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.