Vijay : ఎన్నికలకి సిద్ధం అంటున్న విజయ్.. పార్టీ తరపున పోటీ చేయమని అభిమానులకి పిలుపు..

తమిళనాడులో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్‌ తన అభిమానులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని గురించి విజయ్‌..

Vijay : ఎన్నికలకి సిద్ధం అంటున్న విజయ్.. పార్టీ తరపున పోటీ చేయమని అభిమానులకి పిలుపు..

Vijay

Vijay :  తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఎం.చంద్రశేఖర్‌ విజయ్‌ మక్కల్‌ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్‌ చేయించారు. ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు తలెత్తి కోర్టు వరకు వెళ్లారు. విజయ్‌ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడరాదని కోర్టు నుంచి ఆర్దర్లు కూడా తెచ్చుకున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విజయ్ రాజకీయాల్లోకి వస్తాడు అనే తెలుస్తుంది.

ఇటీవల తమిళనాడులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్‌ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విజయ్‌ తన పేరును వాడొద్దు అని ఆంక్షలు విధించినా విజయ్ అభిమానులు గ్రామీణ ప్రాంతాలలో విజయ్ ఫొటోతో ప్రచారం చేసి గెలిచారు. ఆ తర్వాత వారంతా విజయ్ ని కలిసి ఫోటోలు దిగడం విశేషం.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

తమిళనాడులో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్‌ తన అభిమానులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని గురించి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో ఇప్పుడు జరగబోయే నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరుపై పోటీ చేయొచ్చని తెలిపాడు. అయితే దీనిపై ప్రత్యక్షంగా విజయ్ స్పందించలేదు.

RGV : పబ్‌లో ఆర్జీవీ రచ్చ.. నటితో ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్..

దీంతో మరోసారి విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇటీవలే 2021లో తమిళనాడు ఎలక్షన్స్ జరిగాయి. మళ్ళీ 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ లోపు విజయ్ ఇలా పరోక్షంగా తన అభిమానులతో పోటీ చేయించి అప్పటికి ఉన్న పరిస్థితులను, గెలుపు అవకాశాలని అంచనా వేసి 2026 ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.