Manish Sisodia: తీహార్ జైలులో వృద్ధుల సెల్‌లో సిసోడియా.. తొలిరోజు మెనూ ఏమిటంటే?

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తీహార్ జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఢిల్లీ కోర్టు సిసోడియాకు మార్చి 20వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Manish Sisodia: తీహార్ జైలులో వృద్ధుల సెల్‌లో సిసోడియా.. తొలిరోజు మెనూ ఏమిటంటే?

Sisodia

Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తీహార్ జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఢిల్లీ కోర్టు సిసోడియాకు మార్చి 20వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు సోమవారం సాయంత్రం తరలించారు. జైలుకు తరలించిన తరువాత వైద్య పరీక్షలు నిర్వహించారు. తీహార్ జైలులో నెం.1లోని సెల్ నెంబర్ 9లో సిసోడియాను ఉంచినట్లు సమాచారం. ఆయనకు వృద్ధుల సెల్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ సెల్‌లో సిసోడియా ఒక్కరే ఉన్నాడు.

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు

జైలులో సిసోడియా సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాడు. జైలు సిబ్బంది సిసోడియాకు టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు, కొన్ని పాత్రలను రోజవారీ ఉపయోగించే వస్తువులను కిట్ రూపంలో అందించారు. తీహార్ జైలులో ఖైదీలకు సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భోజన సమయం ఉంటుంది. ఈ సమయంలో సిసోడియా భోజనం చేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు. సిసోడియా తిన్న భోజనంలో రోటీ, అన్నం, పప్పు, బంగాళదుంప, బఠానీల కూర కూడా అందించారు. ఆ తరువాత రెండు దుప్పట్లు, ఒక బెడ్ షీట్‌ను సిసోడియాకు జైలు సిబ్బంది అందించినట్లు సమాచారం.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

2021-22 మద్యం పాలసీ తయారీ, అమలులో అవినీతి ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం విధితమే. కాగా, సోమవారం సిసోడియా కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ కోర్టు ముందు హాజరుపర్చగా.. ఈనెల 20వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది.  దీంతో సిసోడియాను తీహార్ జైలుకు పంపించారు. ఇదిలాఉంటే మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) బృందం  సిసోడియాను విచారించేందుకు తీహార్ జైలుకు వెళ్లింది. ఈడీ బృందం ఉదయం 11 గంటలకు జైలుకు వెళ్లి సిసోడియాను విచారిస్తోంది.