Karnataka Polls: మళ్లీ బీజేపీలోకి వస్తే.. షెట్టర్ రాజీనామాపై స్పందించిన యడియూరప్ప

ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగదీష్ షెట్టర్ ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు

Karnataka Polls: మళ్లీ బీజేపీలోకి వస్తే.. షెట్టర్ రాజీనామాపై స్పందించిన యడియూరప్ప

Yediyurappa

Karnataka Polls: మరో కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‭ (Former Karnataka CM and senior leader Jagadish Shettar) పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ఆయనకు నిరాశే ఎదురైంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశమైనప్పటికీ టికెట్ మాత్రం లభించలేదు. దీంతో తీవ్ర కోపానికి లోనైన షెట్టర్.. బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

అయితే ఆయన రాజీనామాపై మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న బీఎస్ యడియూరప్ప స్పందించారు. కొన్ని అపోహలు, అపార్థాల వల్ల రాజీనామా చేసి ఉండొచ్చని, అయితే ఆయన తిరిగి పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని యడ్డీ అన్నారు. షెట్టర్ రాజీనామా అనంతరం మీడియాతో యడియూరప్ప మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ. నాకు, జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాడి సహా చాలా మందికి గొప్ప పదవులు ఇచ్చింది. లక్ష్మణ్ సవాది ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనను ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేశాము. జగదీష్ షెట్టర్ సైతం గతంలో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వీళ్లెందుకు పార్టీని వీడారో అర్థం కావడం లేదు’’ అని అన్నారు.

Atiq Ahmed: అతీక్ అహ్మద్ మామూలోడు కాదు.. ఈ ఫొటో చూడండి మీకే తెలుస్తుంది!

ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగదీష్ షెట్టర్ ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే.. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని షెట్టర్ స్పష్టం చేశారు. అయితే ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు తీవ్ర అవమానకరమని అన్నారు. పార్టీ నేతలు తనను కించపరచినందువల్లే తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని షెట్టర్ చెప్పారు.