Viral Video: ఎత్తైన అపార్ట్‌మెంటులో ప్రమాదకర స్థితిలో అద్దాలను తుడిచిన మహిళ

ఎత్తైన ప్రాంతాలకు వెళ్తే కొందరికి కళ్లు తిరుగుతాయి. ఇక అటువంటి ప్రాంతాల్లో చివరంచున నిలబడితే..? కింద పడే ప్రమాదం ఉంటుందని ఎవరూ అంతటి సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా ఎత్తైన ప్రాంతంలో చివరి అంచున నిలబడితే..? ఆశ్చర్యంగా చూస్తాం. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: ఎత్తైన అపార్ట్‌మెంటులో ప్రమాదకర స్థితిలో అద్దాలను తుడిచిన మహిళ

Viral Video

Updated On : January 15, 2023 / 8:22 AM IST

Viral Video: ఎత్తైన ప్రాంతాలకు వెళ్తే కొందరికి కళ్లు తిరుగుతాయి. ఇక అటువంటి ప్రాంతాల్లో చివరంచున నిలబడితే..? కింద పడే ప్రమాదం ఉంటుందని ఎవరూ అంతటి సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా ఎత్తైన ప్రాంతంలో చివరి అంచున నిలబడితే..? ఆశ్చర్యంగా చూస్తాం. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎత్తైన అపార్ట్‌మెంటులోని ఓ ఫ్లాటులో ఓ మహిళ చివరంచున నిలబడి అద్దాలను తుడిచింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వేరే అపార్ట్ మెంటు నుంచి కెమెరాలో బంధించాడు. ఆమె అంత ఎత్తున ప్రమాదకర స్థితిలో నిలబడి అద్దాలను శుభ్రం చేయడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో చూస్తూ మతిపోతోందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాలు జారితే ఆమె ఇక అంతే.. అంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. అద్దాలను శుభ్రం చేయాలంటే ఇటువంటి సాహసం చేయాలా? అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇటువంటి పనులు కొనసాగిస్తే ఏదో ఒక రోజు కాలు జారి కిందపడతారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. గతంలోనూ ఓ మహిళ ఇలాగే ఓ అపార్ట్ మెంట్లో అద్దాలు తెరుచుకుని బయటకు వచ్చి ఇలాగే వాటిని శుభ్రం చేసింది. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.

Old Woman Raped : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. లిఫ్ట్‌ ఇస్తానని అఘాయిత్యం