Yogi Govt: యోగి గవర్నమెంట్ షాకింగ్ డెసిషన్.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్

బ్యూరోక్రటిక్ రీషఫుల్ లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్ లతో పాటు మరో 6 ప్రాంతాలకు చెందిన అధికారులు ఉన్నారు.

Yogi Govt: యోగి గవర్నమెంట్ షాకింగ్ డెసిషన్.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్

Yogi Adithya Nath

 

 

Yogi Govt: బ్యూరోక్రటిక్ రీషఫుల్ లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లక్నో, కాన్పూర్, గోరఖ్‌పూర్ లతో పాటు మరో 6 ప్రాంతాలకు చెందిన అధికారులు ఉన్నారు.

గత వారం జరిగిన ఆందోళనల తర్వాత కాన్పూర్ డీఎం నేహా శర్మను లోకల్ బాడీస్ డైరక్టర్ గా నియమించారు. సకాలంలో స్పందించకపోవడంతోనే ఆందోళనల్లో హింస అంతగా జరిగిందని భావిస్తున్నట్లు కొన్ని వర్గాల సమాచారం.

శర్మనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది జిల్లాలకు చెందిన మరికొందరు ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. బల్లియా,అలీఘర్, బస్తీ, జలౌన్, ఎతవాహ, ఫిరోజాబాద్, గోరఖ్‌పూర్ లకు చెందిన అధికారులను కూడా మార్చేశారు.

Read Also: మథుర, బృందావన్ కూడా పునరుద్ధరిస్తాం: సీఎం యోగి ఆదిత్యనాథ్

అందిన సమాచారం ప్రకారం.. లక్నో డీఎం అభిషేక్ ప్రకాశ్.. ఇండస్ట్రియల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఫిరోజాబాద్ డీఎం సూర్యపాల్ గంగ్వార్ స్థానంలో ప్రకాశ్ వెళ్లారు.

ఈ ఏడాది మార్చిలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత నెల వ్యవధిలో ఇది రెండో పెద్ద ట్రాన్సఫర్లు. గత నెలలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.