Women Trapping Men: ఇంటికి పిలిచి ఎంజాయ్ చేసిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు

యువకుడికి గత కొన్నిరోజులుగా తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అవతలి నుంచి ఓ యువతి గొంతు వినిపిస్తుంది. మా ఇంటికి ఒక్కసారి వచ్చిపో అంటూ పదేపదే యువకుడిని కోరింది. కొన్నిరోజుల తరువాత ఓసారి యువతి ఇంటికి వెళ్లాడు.

Women Trapping Men: ఇంటికి పిలిచి ఎంజాయ్ చేసిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు

Women Trapping Men

Women Trapping Men: యువతులను మాయమాటలతో లోబర్చుకొని, శరీరకంగా కలిసిన సమయంలో వీడియోలు తీసి వారిని బెదిరింపులకు గురిచేయడం, వారి నుండి డబ్బులు వసూళ్లు చేయడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉంటాయి. కానీ, ఓ యువతి యువకుడ్ని అదే తరహాలో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించింది. బలవంతం చేసి శారీరకంగా ఒక్కటైంది.. ఆ వీడియోను తీసి బెదిరించే ప్రయత్నం చేయగా.. పోలీసులకు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన కేసు హర్యానా రాష్ట్రం మహేంద్రగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

Shraddha Das : శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధాదాస్..

యువకుడికి గత కొన్నిరోజులుగా తెలియని నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అవతలి నుంచి ఓ యువతి గొంతు వినిపిస్తుంది. మా ఇంటికి ఒక్కసారి వచ్చిపో అంటూ పదేపదే యువకుడిని కోరింది. కొన్నిరోజుల తరువాత ఓసారి యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో యువతి ఒక్కటే ఉంది. యువకుడు వెళ్లగానే ఇంటి తలుపులు మూసేసి బలవంతంగా అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోను తీసింది. ఆ తరువాత ఆ వీడియోను యువకుడికి పంపించి నాకు లక్ష కావాలని లేకుంటే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తా అంటూ బెదిరించింది. యువతి తీరుతో కంగుతిన్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Virupaksha : సాయి ధరమ్ తేజ్ & సంయుక్త విరూపాక్ష స్పెషల్ ఇంటర్వ్యూ

యువకుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనేందుకు స్కెచ్ వేశారు. యువతి డిమాండ్ మేరకు.. డబ్బుల నోట్ల నెంబర్లను నమోదు చేసుకొని ఆ యువకుడికి ఇచ్చి యువతి దగ్గరకు పంపించారు. యువకుడు వెళ్లగానే  అతని వద్ద రూ. లక్ష నగదును యువతి తీసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆమెను రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.