YS Sharmila: అందుకే సీఎం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు: షర్మిల

'కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం షర్మిల’ అన్న విషయం సీఎం కేసీఆర్ కు అర్థమైందని, ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన పాదయాత్రతో సీఎం కేసీఆర్ కు వణుకుపుడుతోందని చెప్పారు. ఇటీవల వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర కలకలం చెలరేగిన విషయం విదితమే.

YS Sharmila: అందుకే సీఎం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు: షర్మిల

YS Sharmila

YS Sharmila: ‘కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం షర్మిల’ అన్న విషయం సీఎం కేసీఆర్ కు అర్థమైందని, ఒక మహిళ వచ్చి ప్రశ్నిస్తుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన పాదయాత్రతో సీఎం కేసీఆర్ కు వణుకుపుడుతోందని చెప్పారు. ఇటీవల వరంగల్ లోని చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్రలో తీవ్ర కలకలం చెలరేగిన విషయం విదితమే.

శంకరం తండా శివారులో షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. ఆ తదుపరి రోజు షర్మిల కూర్చున్న కారును క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ వరకు లాక్కెళ్లారు. దీనిపై షర్మిల ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ కు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వద్దో చెప్పాలని, తనకు ప్రాణహాని ఉందని అన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రశ్నిస్తూ తాను ప్రజలకు కలుస్తుంటే శాంతి భద్రతల పేరుతో పాదయాత్రను అడ్డుకుంటున్నారని చెప్పారు. తనను మరదలు అని పేర్కొంటూ ఓ మంత్రి కించపర్చడం వ్యక్తిగత దూషణ కాదా? అని ఆమె నిలదీశారు.

Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ

తన పాదయాత్రలో తాను ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని షర్మిల చెప్పారు. వైఎస్సార్టీపీ తెలంగాణలో బలం పుంజుకోకుండా అడ్డుకోవాలనుకుంటున్నారని అన్నారు. తాను కారులో ఉండగానే కారును తీసుకెళ్లారని చెప్పారు. తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ఆటలు సాగాయని, ఇకపై కుదరదని చెప్పారు. తన మీద దాడులు జరిగినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..