Benefits Of Cycling : శరీరానికి , మనస్సుకు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు !

సైక్లింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది, సమర్థవంతమైన మధుమేహ నిర్వహణకు దోహదపడే అన్ని కీలకమైన కారకాలు సైక్లింగ్ వల్ల లభిస్తాయి.

Benefits Of Cycling : శరీరానికి , మనస్సుకు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు !

Benefits Of Cycling

Benefits Of Cycling : సైకిల్ తొక్కడం అన్నది ఒత్తిడిని తగ్గించటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో అద్భుతమైనదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి , దీర్ఘకాలిక వ్యాధులకు ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం. సైకిల్ తొక్కడం గుండె ఆరోగ్యాన్ని , కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. సైక్లింగ్ డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్‌ని తగ్గించడానికి , హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో తేలింది.

READ ALSO : Daily Exercises : చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచే రోజువారి వ్యాయామాలు! నడకతోపాటుగా, సైక్లింగ్ మంచిదే?

సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని దిగువ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఇవన్నీ మధుమేహానికి ప్రమాద కారకాలు. సైక్లింగ్‌ని మన జీవితంలో ఒక అభిరుచిగా చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవచ్చు.

ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఈ రోజుల్లో సైక్లింగ్ చాలా ప్రజాదరణ పొందిన మార్గం. సైక్లింగ్ ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. వినోదభరితమైన కార్యకలాపంగా ఉంటుంది.

READ ALSO : రోజూ సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు..

శరీరానికి సైకిల్ తొక్కడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలు :

1. కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది ;

సైకిల్ తొక్కేందుకు అన్ని కండరాలు పదేపదే ఉపయోగించబడుతున్నందున శరీర బలాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ఫలితంగా, గ్లూటయల్ కండరాలు, కండరాలు ఒక ఆకృతికి
వస్తాయి.

2. ఓర్పును మెరుగుపరుస్తుంది ;

ఓర్పును మెరుగుపరచడానికి, సత్తువ,హృదయనాళ పనితీరును పెంపొందించడానికి సహాయపడుతుంది. సైక్లింగ్ సమయంలో హృదయ స్పందన రేటు పెరుగుతుంది. గుండె రక్తాన్ని
మరింత ప్రభావవంతంగా పంపింగ్ చేస్తుంది.

READ ALSO : Workout Injuries : జిమ్ గాయాలు ఫిట్‌నెస్ లక్ష్యాలకు అంతరాయం కలిగిస్తే? వాటిని ఎలా నయం చేసుకోవాలంటే..

3. మానసిక ఆరోగ్యం ;

సైక్లింగ్ డిప్రెషన్, యాంగ్జయిటీ, ఒత్తిడిని నివారిస్తుంది. హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని పెంచుతుంది. దానికి తోడు సైక్లింగ్ నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది
కొత్త ఆలోచనా విధానాలను రూపొందించడంలో సహాయపడుతుంది. మెదడులో వివిధ రకాల మార్పులను తెస్తుంది. ప్రశాంతత , శరీర శ్రేయస్సు ను ప్రోత్సహిస్తుంది.

4. గర్భధారణలో సహాయపడుతుంది ;

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల పిల్లలు కనబోయే తల్లులకు ఎంతో సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్‌గా ఉండటం సహజమైన బిడ్డకు జన్మ నివ్వటానికి
సహాయపడుతుంది.

5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది ;

వ్యాయామం చేయడానికి ఒక ఆహ్లాదకరమైన, అద్భుతమైన మార్గం సైక్లింగ్. రోజుకు అరగంట పాటు సైకిల్ తొక్కడం కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

READ ALSO : Diabetes : మధుమేహులు కాలేయం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

6. కీళ్ల ఆరోగ్యం ;

సైక్లింగ్ దిగువ శరీర కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7. సామాజిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది ;

స్నేహితులు, ఇతరులతో కలిసి సైకిల్‌పై ట్రెక్‌లకు వెళ్లే సమూహాలు ఉన్నాయి. ఇది వ్యక్తుల మధ్య పరిచయాలు పెంచటానికి, స్నేహితులను చేసుకోవడానికి , తద్వారా సామాజిక జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి దోహదపడుతుంది.

READ ALSO : Exercises : కఠినతరమైన వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలోనే చేయటం మంచిదా?

మధుమేహంతో బాధపడేవారికి సైక్లింగ్ వల్ల ప్రయోజనాలు ;

సైక్లింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది, సమర్థవంతమైన మధుమేహ నిర్వహణకు దోహదపడే అన్ని కీలకమైన కారకాలు సైక్లింగ్ వల్ల లభిస్తాయి. మెరుగైన రక్త ప్రసరణకు సైక్లింగ్ తోడ్పడుతుంది. నరాల దెబ్బతినడం , పాదాల పుండ్లు వంటి మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయి. సైక్లింగ్ సహజ రసాయనాలు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతుంది.