Cardamom : అజీర్ణం, గ్యాస్ సమస్యలకు యాలకులతో చెక్

ఆయుర్వేదంలో యాలకులను విరివిగా వినియోగిస్తారు. శరీరానికి చలువ కలిగించే గుణం యాలుకల్లో ఉండటంతో ఆహారాల్లో వీటిని వాడుతారు. కుంకుమ పువ్వు తరువాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా యాలుకలను చెప్పవచ్చు.

10TV Telugu News

Cardamom : సుగంధ ద్రవ్యాలలో యాల‌కులు ముఖ్యమైనవి.. పురాతన కాలం నుండి వీటి వినియోగం ఉంది. బ్రిటీష్ కాలంలో యలుకలను వ్యవసాయ పంటగా పెద్ద ఎత్తున సాగు చేపట్టారు. సుంగంధ ద్రవ్యాలలో కెల్ల అత్యంత సువాసన కలిగినది. అందరి గృహాల్లో వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు,పాయసం, వక్కపొడులు, కిళ్ళీలు ఇతర ఆహారాలలో భాగంగా చేసుకుని యలుకలను వినియోగిస్తారు. వీటిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

ఆయుర్వేదంలో యాలకులను విరివిగా వినియోగిస్తారు. శరీరానికి చలువ కలిగించే గుణం యాలుకల్లో ఉండటంతో ఆహారాల్లో వీటిని వాడుతారు. కుంకుమ పువ్వు తరువాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా యాలుకలను చెప్పవచ్చు. ప్రపంచంలోనే యాలకులు అత్యధికంగా పండించేది మనదేశమే. యాలకుల గింజల్లో టర్పనైన్, లిమొనెన్, టెర్పినోల్ వంటి రసాయనాలు ఉంటాయి. సాంప్రదాయ వైద్యంలో వివిధ రకాల జబ్బులకు నయం చేసేందుకు వినియోగిస్తారు. రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది.

ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి తీసుకుంటే కంటి చూపు మెరుగుప‌డుతుంది. యాలకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 1, బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, కాల్షియం బరువును నియంత్రిస్తుంది. యాల‌కుల‌తో త‌యారు చేసిన డికాష‌న్‌ను తాగ‌డం వ‌ల్ల విరేచ‌నాలు త‌గ్గుతాయి. చ‌ల్లార్చిన డికాష‌న్ తాగాల్సి ఉంటుంది. యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి.

యాలకులలోని పొటాషియం, ఫైబర్ కంటెంట్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాలకులు రోజూ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది. యాల‌కులు, బెల్లం వేసి త‌యారు చేసి డికాష‌న్‌ను రోజుకు 3 సార్లు తీసుకుంటే త‌ల‌తిర‌గ‌డం త‌గ్గుతుంది. గుండె సమస్య, డయాబెటిస్‌ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యాలకులు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

శృంగార సామర్థ్యం పెంచటంలో యాలకులను మించిందిలేదంటారు. పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారించటంలో దోహదపడతాయి. అంగస్తంభన సమస్యను నయం చేసి శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణను పెంచడానికి యాలకుల నూనెను ఉపకరిస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టటానికి భోజనం తర్వాత ఇది వీటిని చాలామంది నోట్లో నములుతుంటారు. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులను నియంత్రిస్తుంది.

చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల యాలకులు వాడడం మంచిది. టీ మంచి సువాసన కలిగి ఉండటానికి యాలకుల పొడి వేస్తారు. యాల‌కుల పొడి, పిప్ప‌ళ్ల పొడిని కొద్ది కొద్దిగా తీసుకుని క‌లిపి నెయ్యితో తీసుకోవాలి ఇలా చేస్తే క‌డుపునొప్పి త‌గ్గుతుంది. వెక్కిళ్ళతో బాధపడేవారు నీటిని మ‌రిగించాక అందులో యాల‌క్కాయ‌లు, పుదీనా ఆకులు కొద్దిగా వేసి 5 నిమిషాలు ఆగాక ఆ నీటిని తాగాలి. వెక్కిళ్ల సమస్యతగ్గిపోతుంది.

గ్లాస్ నీటిలో కొద్దిగా యాల‌కుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి మ‌రిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని గోరువెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. దీంతో గొంతు స‌మ‌స్య‌లు పోతాయి. యాల‌కుల పొడి, సోంపు గింజ‌ల పొడిని తీసుకుని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. భోజ‌నం చేసిన త‌రువాత తాగితే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు రోజుకు 2 సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అర‌టిపండ్ల‌తో క‌లిపి యాల‌కుల‌ను తింటే వాంతులు, వికారం త‌గ్గుతాయి. జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యం యాలకులకు ఎక్కువగా ఉంటుంది.యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.