Diabetes :షుగర్ వ్యాధి దరి చేరకుండా ఉండాలంటే?..

బరువు తగ్గడానికి కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదనుకుంటారు. మరికొంతమంది జంక్‌ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇలా ఏదో ఒకేరకమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం కొన్ని రకాల పోషకాలను కోల్పోవచ్చు.

 Diabetes :షుగర్ వ్యాధి దరి చేరకుండా ఉండాలంటే?..

Sugar (1)

Diabetes : ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలను షుగర్ వ్యాధి కలిగి ఉంటుంది. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించటం, బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. ఒకప్పుడు డయాబెటిస్ వంశపార పర్యంగానే వచ్చేదని చెప్తుండేవారు. అయితే మారిన జీవన విధానంతో అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ రోజుల్లో అతి తక్కువ వయస్సున్న వారు సైతం డయాబెటిస్ కు గురవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

బిజీ లైఫ్‌స్టైల్, పని ఒత్తిడి, వ్యాయామాలు చేయకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా డయాబెటిస్‌కు దారితీస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. దీంతో దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధిని ముందుగానే నిర్ధారించి, నియంత్రించకపోతే అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం, గుండె సంబంధ సమస్యలు వంటి అనారోగ్యాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వారికి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే కోలుకోవడం కొంచెం కష్టం. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వచ్చిన తర్వాత కంటే కూడా రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాయామాల వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ బారిన పడకుండా కాపాడుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల శరీర కణాలకు ఇన్సులిన్ను సంగ్రహించే శక్తి పెరుగుతుంది. ఇలాంటి కసరత్తులు చేసేవారిలో రక్తంలో చెక్కర స్థాయులను అదుపులో ఉంచడానికి తక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఏరోబిక్స్, అధిక తీవ్రత ఉండే వివిధ రకాల వ్యాయామాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే మీకు నచ్చిన ఏదో ఒక వ్యాయామాన్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి.

ఊబకాయులు, బరువు ఎక్కువ ఉన్న వారు డయాబెటిస్ కు దూరంగా ఉండాలంటే బరువు తగ్గాలి. ఈ ప్రక్రియలో మీరు కోల్పోయే ప్రతీ కిలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊబకాయులు కనీసం ఏడు శాతం బరువు తగ్గి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 60 శాతం తగ్గుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. నీరు ఎక్కువగా తాగడం వల్ల చక్కెర, ఇతర ప్రిజర్వేటివ్స్ కలిపిన కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

కూల్ డ్రింక్స్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌ వల్ల లేటెంట్ ఆటోఇమ్యూన్ డాయాబెటటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది 18 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే టైప్1 డయాబెటిస్. నీరు ఎక్కువగా తాగడం వల్ల రెండు రకాల డయాబెటిస్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వారి రక్తంలో చక్కెర స్థాయులు మరింత స్థిరంగా ఉంటాయని వివిధ అధ్యయనాల్లో తేలింది.

బరువు తగ్గడానికి కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదనుకుంటారు. మరికొంతమంది జంక్‌ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇలా ఏదో ఒకేరకమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం కొన్ని రకాల పోషకాలను కోల్పోవచ్చు. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన వెయిట్ మేనేజ్మెంట్ కోసం నిపుణుల సలహాతో అన్ని రకాల పోషకాలుండే సమతులాహారాన్ని ఎంచుకోవాలి.

ఆహారంలో ఎక్కువ మొత్తంలో పీచుపదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌కు దూరంగా ఉండొచ్చు. ఫైబర్ ఉండే సమతులాహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. దీంతో సహజంగానే డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు బరువు తగ్గుతారు. వారికి గుండె జబ్బులు వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహారంలో ఫైబర్ వనరులైన అన్నిరకాల పండ్లు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి