Technology Sensitivity: మనిషిని మాయం చేస్తోన్న టెక్నాలజీ.. ఆన్‌లైన్ కంటెంట్‌తో భయంకర నేరాలు
నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది.

Technology killing human sensitivity
Technology Human Sensitivity : ఆధునిక సాంకేతికత మనిషిని మాయం చేస్తోందా? పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న మనిషి మానవత్వాన్నే మరచిపోతున్నాడా? పగవాడికి కూడా కష్టం రాకూడదని ప్రార్థించే మనిషి రాక్షసుడిగా ఎలా మారుతున్నాడు? కలిసిమెలిసి జీవించాలని చాటిచెప్పే సమాజంలో ఒళ్లు గగుర్పొడిచే నేరాలకు ఎలా పాల్పడుతున్నాడు? అసలు అంత భయంకర ఆలోచనలు ఎలా వస్తున్నాయి? అన్నింటికి ఒకటే సమాధానం టెక్నాలజీ. ఏ టెక్నాలజీ అయితే మనిషి ఆలోచనలను పదునుపెట్టి.. కొత్త శిఖరాలకు చేర్చిందో అదే టెక్నాలజీ మనిషిలోని సున్నితత్వాన్ని చంపేస్తోంది. మానవత్వాన్ని మాయం చేస్తోంది.
భయంకర నేరాలతో సమాజానికి సవాల్
మనకు తెలియని విషయం ఏదైనా ఉందంటే.. వెంటనే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం చాలామందికి అలవాటు. ఎలాంటి అంశమైనా చిటికెలో సమాధానం, సమాచారం లభించే ఏకైక సాధనం ఇంటర్‌నెట్. ఆన్‌లైన్‌లో వెదికితే ఎలాంటి కష్టమైన పనికైనా సులువైన పరిష్కారం లభిస్తోంది. ఇది మంచిపనులకు.. స్వీయ అభివృద్ధికి వాడితే దాన్ని అంతా స్వాగతించాల్సిందే. కానీ ఇప్పుడు భయంకర నేరాలు.. నేరస్థులు తప్పించుకోడానికి సాధనంగా మారిపోయింది ఇంటర్‌నెట్. మన పోలీసులకు.. భద్రతా దళాలకు నియంత్రణలేని కంటెంట్లు అప్‌లోడ్ చేస్తుండటంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. హత్యలు చేయడం ఎలా? పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా ? అనేది సమాచారం చాలా సులువుగా లభిస్తోంది? బాంబులు తయారు చేయడం నుంచి హత్యలు చేయడం చేసిన నేరం నుంచి తప్పించుకునే మార్గాలు ఇలా ప్రతీది ఇంటర్నెట్‌లో దొరుకుతోంది. అత్యంత భయంకర నేరాలకు పాల్పడూ సమాజానికి సవాల్ విసురుతున్నారు నేరస్తులు.
అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్
కొన్నిరకాల నేరాల నియంత్రణ.. నిందితులను పట్టుకునేందుకు కూడా ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఎంతటి నేరస్తుడైనా గంటల వ్యవధిలో పట్టుబడుతున్నాడు. ఇది కూడా టెక్నాలజీ గొప్పతనమే. కానీ.. నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్‌గా మారింది. ఎవరైనా క్షణికావేశంలో తప్పుచేస్తే సరిపెట్టుకోవచ్చు. ఏదో ఆవేశంలో జరగరానిదేదో జరిగిందనుకోవచ్చు. కాని ఓ వ్యక్తి మరో వ్యక్తిని చంపాలని కసి పెంచుకుని.. పగలతో రగిలిపోతూ పక్కా పథకం ప్రకారం హత్యకు పాల్పడితే అటువంటి కరుడుగట్టిన నేరస్తుడే అయివుంటాడు. కాని ఇప్పుడు సాధారణ వ్యక్తులు కూడా కరుడు గట్టిన నేరస్తులుగా మారిపోతున్నారు. తప్పుమీద తప్పు చేస్తూ తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నేరాలు ఎలా చేయాలనేది ఆన్‌లైన్‌లో తెలుసుకుంటూ ప్రాక్టీసు ప్రకారం ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వెలుగుచూసిన నేరాలు అన్నీ ఈ కోవలోకి చెందినవే.
Also Read: అప్సర హత్య కేసులో వెలుగులోకి మరో కొత్తకోణం.. అప్సర పెళ్లిఫొటోలు వైరల్
ఆన్‌లైన్‌లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది. నిందితులు నేరాలకు పాల్పడే ముందు ఆన్‌లైన్‌లో వెదుకుతున్నప్పుడే.. పోలీసులను అలర్ట్ చేసే టెక్నాలజీ లేకపోవడంతో.. నేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్యకేసు మొదలుకొని.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌లో వెలుగుచూసిన హత్య కేసు వరకు నిందితులు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే నేరాలకు పాల్పడ్డారు. హత్యలు చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను కూడా ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నారు. పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీతో నిందితులు దొరికిపోయినా.. అమాయక ప్రాణాలు మాత్రం బలైపోతున్నాయి. నిందితులు ఆన్‌లైన్‌లో భయంకరమైన నేరాలపై సెర్చ్ చేస్తున్నప్పుడే.. పోలీసులను అలర్ట్ చేసే సాంకేతిక అందుబాటులో ఉంటే అమాయకుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సమాజానికి చేటు తెచ్చే ఎలాంటి దృశ్యాలైనా అప్‌లోడ్ చేయకుండా.. వైరల్ చేయకుండా నిరోధించే టెక్నాలజీ అన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంది. కానీ.. కొన్ని ఆన్‌లైన్ సైట్లలో ప్రమాదకర కంటెంట్ యథేచ్ఛగా అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ అప్‌లోడ్ చేయకుండా ప్రభుత్వం పటిష్ట నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రమాదకర కంటెంట్ సెర్చ్ చేస్తున్న వారి సమాచారం పోలీసులకు తెలిసే టెక్నాలజీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ పోలీసింగ్ పటిష్టతతోనే ఈ నేరాలను కొంతవరకు నిరోధించవచ్చు.
నేరస్తులు అనుసరిస్తున్నఫార్ములా ఇదే.. వివరాలకు ఈ వీడియో చూడండి..