Heavy Weight : మీలో ఫిట్‌నెస్ తగ్గిందని తెలిపే సంకేతాలు ఇవే!

చాలామంది తమ శరీర బరువు పెరిగిందని, శరీరాకృతి అందవిహీనంగా మారిందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు బరువు పెరిగినట్లే.

Heavy Weight : మీలో ఫిట్‌నెస్ తగ్గిందని తెలిపే సంకేతాలు ఇవే!

Heavy Weight

Heavy Weight : కరోనా మహమ్మారి మనుషులను ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా దెబ్బకొట్టింది. ఈ మహమ్మారి బారినపడి చాలా కుటుంబాలు ఇప్పటికి ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడలేదు. ఇక కొందరు దీని వలన మానసిక ఆందోళనకు గురయ్యారు. వీటిని పక్కన పెడితే కరోనా సమయంలో చాలామంది అధిక బరువు పెరిగారు. ఐతే కొందరికి తమ శరీర ఆకారం మారిందని, అది తమ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందన్న విషయం అర్థం కావట్లేదు. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ఉన్నాయి.

Read More : Ration Card: గుడ్ న్యూస్.. రేషన్ కార్డుకు సంబంధించిన ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం

చిన్నపాటి పనికే శ్వాస ఎగదీసుకోవడం

సాధారణ సమయాల్లో కాకుండా ఏదైనా చిన్న చితక పనులు చేసినప్పుడు శ్వాస ఎగదీసుకుంటుంటే మీ శరీర ఆకారంలో మార్పులు వచ్చి అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసుకోవాలి. మెట్లమీద నడిస్తే శ్వాస క్రియ రేటు పెరిగితే శారీరకంగా ఫిట్ గా లేరని అర్ధం చేసుకోవాలి.

Read More : BCCI Hikes: క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచిన బీసీసీఐ

గుండె స్పందనల వేగం

పని చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె శబ్దం వినండి. మీ గుండె స్పందన వేగం పెరిగినట్లుగా అనిపిస్తే మీరు శారీరకంగా సరిగ్గా లేరని తెలుస్తోంది. శబ్దం అర్ధం కాకపోతే మీరు స్మార్ట్ వాచీ పెట్టుకొని చూస్తే అర్ధవుతోంది.

సులభంగా గాయాలకు గురి కావడం

శరీరం ఫిట్ నెస్ లేకపోతే నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. అక్కడి నొస్తుంది, ఇక్కడ నొస్తుంది అని చెబుతూ ఉంటాం. ఇలాంటి నొప్పుల నుంచి బయటపడాలి అంటే క్రమం తప్పకుండ వ్యాయాయం చేయడం మంచిది. ఆలా చేస్తే నొప్పుల నుంచి బయటపడొచ్చు.

నిద్రలేని రాత్రులు

శారీరక శ్రమ లేకపోతే నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. రాత్రి నిద్రలేకపోవతే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.

ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే శారీరక శ్రమ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు 30 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం చేయాలనీ సూచిస్తున్నారు.