Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!

వెల్లుల్లి రెబ్బలను మిక్స్‌ చేసి అందులో వెనిగర్‌ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట కాటన్‌ బాల్‌తో రాయాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!

Garlic For Facial Beauty

Garlic : ఆరోగ్యంతోపాటు అందానికి వెల్లుల్లి ఎంతో ఉపకరిస్తుంది. చాలా మంది దీనిని వంటల్లోనే పరిమితం చేస్తారు. అయితే వెల్లుల్లి ముఖ, కేశ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖంపై ఏర్పడే మొటిమలు నివారించటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడే యాంటీ బ్యాక్టీరియల్ , క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఉండే సల్ఫర్ సమ్మేళనం చర్మ పొడిబారేందుకు ఏజెంట్ గాపనిచేసి క్రమేపి మొటిమలను తోలగిస్తాయి.

వెల్లుల్లిని చిదిమి దాని నుండి రసాన్ని వేరుచేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వెల్లుల్లి రసంలో తాజా కలబంద గుజ్జును జోడించాలి. ఆమిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచి అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మొటిమలు తొలగిపోతాయి. వెల్లుల్లి రెబ్బలను మిక్స్‌ చేసి అందులో వెనిగర్‌ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట కాటన్‌ బాల్‌తో రాయాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరుచూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్‌, తెల్ల గుడ్డు సొన మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి.

అత్యధిక పోషక విలువలు వెల్లుల్లి జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. జుట్టు ఊడ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బలహీన‌మైన చిగుళ్ళు. దీనికి ఆదిలోనే చెక్ పెట్టాలంటే కొబ్బరి నూనె, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి చేసి తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేసి తలస్నానం చేయటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఐరన్, మినరల్స్ జుట్టును పొడవుగా పెంచేందుకు తోడ్పడతాయి. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి కండరాలూ, చర్మం, ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది..