100 Crores Movies : 100 కోట్లు ఇప్పుడు చాలా ఈజీ గురూ..

ఒకప్పుడు ఈ 100కోట్ల మార్క్ ని చేరడానికి హీరోలు చెయ్యని ప్రయత్నాలు లేవు. స్టార్ హీరోలు నానా తంటాలు పడి ఈ క్రేజీ ఫీట్ సాధించేవాళ్లు. కానీ ఈ జనరేషన్ హీరోలకు అది కామన్ అయిపోయింది. రవితేజ, నాని దగ్గరనుంచి వైష్ణవ్ తేజ్, నిఖిల్ వరకూ అంతా 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోతున్నారు.

100 Crores Movies : 100 కోట్లు ఇప్పుడు చాలా ఈజీ గురూ..

100 crores collections are now common for Tollywood

100 Crores Movies :  100కోట్లు..ఒకప్పుడు 100కోట్ల కలెక్షన్లంటే అది పెద్ద అచీవ్మెంట్, ఒక రికార్డ్, ఒక సెన్సేషన్. అదికూడా స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు 100కోట్లు కామన్ అయిపోయింది. సబ్జెక్ట్ బావుండి, సినిమా జనానికి ఎక్కిందంటే 100కోట్ల కలెక్షన్లు ఇప్పుడు పెద్ద కష్టం కాదని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు యంగ్ హీరోలు. 100కోట్లు కలెక్షన్లా.. అమ్మో.. అనుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ రేర్ రికార్డ్ దుమ్ముని ఇప్పుడు యంగ్ హీరోలు కూడా దులిపేస్తున్నారు.

ఒకప్పుడు ఈ 100కోట్ల మార్క్ ని చేరడానికి హీరోలు చెయ్యని ప్రయత్నాలు లేవు. స్టార్ హీరోలు నానా తంటాలు పడి ఈ క్రేజీ ఫీట్ సాధించేవాళ్లు. కానీ ఈ జనరేషన్ హీరోలకు అది కామన్ అయిపోయింది. రవితేజ, నాని దగ్గరనుంచి వైష్ణవ్ తేజ్, నిఖిల్ వరకూ అంతా 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోతున్నారు.

టాలీవుడ్ లో ప్రజెంట్ హాట్ టాపిక్ దసరా మూవీ గురించే. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన దసరా మూవీని శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. కంప్లీట్ తెలంగాణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫ్రెష్ ఫీల్ తో తెరకెక్కిన దసరా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన దగ్గరనుంచి అదే కలెక్షన్లు కంటిన్యూ చేస్తున్న దసరా 6 రోజులకే 100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. నాని కెరీర్ స్టార్ట్ చేసిన 15 ఏళ్లలో 100కోట్ల మార్క్ దాటడం ఇదే ఫస్ట్ టైమ్.

Image

ఇక మాస్ మహారాజా రవితేజ కూడా లాస్ట్ ఇయర్ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ చివర్లో ధమాకా సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 100కోట్లకు పైగా కలెక్ట్ చేసి రవితేజ కి మొదటి వందకోట్ల సినిమాగా నిలిచింది. ఆ వెంటనే మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసేశారు.

Image

తెలుగు ఆడియన్స్ కి తప్ప సౌత్ లో కూడా మిగిలిన లాంగ్వేజెస్ వాళ్లకే తెలీని హీరో నిఖిల్ కూడా కార్తికేయ 2 సినిమాతో మొదటిసారి 100కోట్ల కలెక్షన్స్ సాధించి పెద్ద హిట్ కొట్టాడు. హిట్ అంటే ఏదో అల్లా టప్పా హిట్ కాదు 120 కోట్లకు పైగా కలెక్షన్లతో పాన్ ఇండియా వైడ్ గా ట్రెండ్ సెట్ చేశాడు నిఖిల్. చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి హీరోగా ఎదిగిన నిఖిల్ కెరీర్ లో 100కోట్లు కలెక్ట్ చెయ్యడం మాములు విషయం కాదు.

Image

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోల 100కోట్ల రేర్ ఫీట్ సాధించాడు. హీరోగా అప్పుడప్పుడే కెరీర్ కంటిన్యూ చేస్తున్న విజయ్ దేవరకొండ 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అప్పటివరకూ యూత్ ని మాత్రమే టార్గెట్ చేసిన విజయ్ గీతగోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసి 100కోట్ల హ్యూజ్ సక్సెస్ అందుకన్నాడు.

Ram Charan Fans : ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు.. ఇలా కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడతారా??

ఇప్పటి వరకూ చెప్పిన హీరోలు కనీసం టాలీవుడ్ లో 10 ఏళ్లకు పైగానే సినిమాలు చేస్తూ కెరీర్ కంటిన్యూ చే్స్తున్నారు. పెద్ద పెద్ద వాళ్లకే ఇన్ని సంవత్సరాలు పట్టిన 100కోట్ల కలెక్షన్ల మార్క్ ని ఫస్ట్ సినిమాతో నే అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో అన్నిరకాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ 100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఫస్ట్ సినిమాతోనే 100కోట్ల మార్క్ రీచ్ అయిన హీరోగా ట్రెండ్ సెట్ చేశాడు.

Rashmika Mandanna : రష్మిక ఆ హీరోలకు నో చెప్పిందా??

ఒకప్పుడు టాప్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే 100కోట్ల కలెక్షన్లని ఇప్పుడు కంటెంట్, ప్రమోషన్స్ తో కొట్టేస్తున్నారు యంగ్ హీరోలు. ఇప్పుడు హీరోలంతా తమ సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేసి అత్యధిక కలెక్షన్స్ కోసం చూస్తున్నారు. ఇక భవిష్యత్తులో 100 కోట్లు అంటే అందరికి కామన్ అయిపోతుందేమో. అయితే ఇండస్ట్రీకే మంచిది.