ఇద్దరికీ కరోనా పాజిటివ్!..

  • Edited By: sekhar , August 14, 2020 / 01:05 PM IST
ఇద్దరికీ కరోనా పాజిటివ్!..

కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజమౌళి ఫ్యామిలీ కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ తేజ, నిర్మాత డివివి దానయ్య, సింగర్ స్మిత.. ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారు, వీరు అని తేడా లేకుండా అందరినీ కరోనా టార్గెట్ చేస్తుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా విషయంలో వణుకుతూనే ఉంది. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కరోనాని కంట్రోల్ చేయడం కష్టమే. తాజాగా టాలీవుడ్‌లోని మరో దర్శకుడికి, ఓ కథానాయికకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయం ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.. ‘‘వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా..’’ అంటూ అజయ్ భూపతి తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన నిక్కీ గల్రానీ కూడా కరోనా బారినపడింది. గొంతునొప్పి, జ్వరం, రుచి మరియు వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ప్రస్తుతం వైద్యుల సూచనలతో ఇంట్లోనే క్షేమంగా ఉన్నట్లు తెలిపింది నిక్కీ. అజయ్ భూపతి, నిక్కీ గల్రానీ త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలవారు, నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.