Akashay Kumar-Kamal Haasan : అన్ని పరిశ్రమల స్టార్ హీరోలు ఒకరి పెళ్ళిలో.. ఎవరి పెళ్లి తెలుసా??
అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్.. ఇలా అనేకమంది అన్ని సినీ పరిశ్రమల నుంచి హాజరయ్యారు. వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో హంగామా చేశారు. ఇంతమంది స్టార్ హీరోలు.............

Akashay, Kamala, Mohan Lal, Aamir Khan.. so many stars attend a marriage
Akashay Kumar-Kamal Haasan : సెలబ్రిటీలు ఇటీవల వేరే సెలబ్రిటీలు, తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు, అభిమానుల పెళ్లిళ్లకు వెళ్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. కానీ ఒకే పెళ్ళికి చాలా మంది, అది కూడా అన్ని పరిశ్రమల నుంచి స్టార్ హీరోలు సైతం వచ్చారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా మరియు స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ కుమారుడు వివాహం తాజాగా రాజస్థాన్ జైపూర్ లోని ఓ కోటలో జరిగింది. ఈ వివాహానికి అన్ని సినీ పరిశ్రమల నుంచి అనేకమంది సెలబ్రిటీలని ఆహ్వానించారు. సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖుడు కావడంతో చాలా మంది సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు.
Unstoppable : బాలకృష్ణ తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ పై ట్రోలింగ్.. స్పందించిన బాలయ్య..
అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్.. ఇలా అనేకమంది అన్ని సినీ పరిశ్రమల నుంచి హాజరయ్యారు. వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో హంగామా చేశారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే పెళ్ళిలో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ పెళ్ళిలో సెలబ్రిటీలు డ్యాన్సులు కూడా వేసి సందడి చేశారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కలిసి పంజాబీ డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అక్షయ్ ఈ డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. మోహన్ లాల్ సర్ మీతో డ్యాన్స్ చేయడం మర్చిపోలేనిది. ఈ మూమెంట్ ని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటా అని పోస్ట్ చేశాడు.
అలాగే అక్షయ్ కుమార్ మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ తో కూడా కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశాడు.
Ulaganayagan #KamalHaasan, @akshaykumar & #Amirkhan at Country Manager and President of Disney Star K.Madhavan son’s marriage function in Rajasthan❤️ pic.twitter.com/Zx3wOG2Gcm
— SundaR KamaL (@Kamaladdict7) February 10, 2023
I’ll forever remember this dance with you @Mohanlal Sir. Absolutely memorable moment ?? pic.twitter.com/GzIwcBbQ5H
— Akshay Kumar (@akshaykumar) February 10, 2023
Akshay Kumar Sir and Prithviraj Sukurmaran Dance Together at a K. Madhavan's Son wedding ❤️?#AkshayKumar? #Prithviraj #Selfiee pic.twitter.com/UqC1KNTsoY
— Arijit ? || AKKian (@Arijit_AKKIan) February 10, 2023