Liger: ‘అక్డీ పక్డీ’ అంటూ ఊరమాస్‌గా రెచ్చిపోయిన లైగర్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ పూరీ జగన్నాధ్....

Liger: ‘అక్డీ పక్డీ’ అంటూ ఊరమాస్‌గా రెచ్చిపోయిన లైగర్

Akdi Pakdi Song Promo From Liger

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి తాజాగా ‘అక్డీ పక్డీ’ అనే పాటకు సంబంధించిన ప్రోమో టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ

ఈ సాంగ్ టీజర్ పూర్తిగా ఊరమాస్ బీట్స్‌కు విజయ్ దేవరకొండ స్టెప్పులు తోడవ్వడంతో ఈ పాట మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ కాబోతుందని ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. ఇక విజయ్ దేవరకొండతో పాటు బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ పాటను జూలై 11న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!

కేవలం ప్రోమోలోనే ఈ రేంజ్ ఊరమాస్ ఉంటే, ఇక పూర్తి పాటలో ఇంకా ఎలాంటి మాస్ స్టెప్పులు ఉంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా మనకు కనిపించనుండగా, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను పూరీ జగన్నాధ్, ఛార్మీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, బాలీవుడ్‌లో కరణ్ జోహర్ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు.