ఫోర్బ్స్ 2020లో అక్షయ్ మాత్రమే.. టాప్ 10లో ఎవరంటే?

  • Published By: vamsi ,Published On : June 6, 2020 / 02:00 AM IST
ఫోర్బ్స్ 2020లో అక్షయ్ మాత్రమే.. టాప్ 10లో ఎవరంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం పొందిన సెలబ్రిటీల జాబితాలో చేరారు. ప్రతి ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసే ఈ 100మంది జాబితాలో భారత్ నుంచి అక్షయ్ మాత్రమే ఉన్నారు. 45.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి అక్షయ్ చోటు దక్కించుకున్నారు. గతేడాది కూడా అక్షయ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

“బాలీవుడ్‌లో అత్యధికంగా సంపాదించే స్టార్” మరియు “భారతదేశంలో సహాయం చేసే ప్రముఖులలో ఒకరు” అని ఫోర్బ్స్ అభివర్ణించింది. హాలీవుడ్ నటులు విల్ స్మిత్ 69 వ స్థానంలో ఉండగా.. హాలీవుడ్ తార ఏంజెలిన్ జోలీ 99వ స్థానంలో ఉంది. వారికంటే అక్షయ్ ముందంజలో 52 వ స్థానంలో ఉన్నాడు.

గతేడాది 33వ స్థానంలో ఉన్న అక్షయ్ ఈ సంవత్సరం 52కి పడిపోయాడు. ఒక ఏడాదిలో ఆయన రూ. 366 కోట్లు సంపాదించినట్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. 2019లో అమెజాన్ కంపెనీతో ‘ది ఎండ్’ అనే వెబ్ సిరీస్ డీల్‌పై సంత‌కం చేసి రూ. 75 కోట్లు సంపాదించాడు అక్షయ్. అదే అతనికి ఈ జాబితాలో చోటు కల్పించినట్లుగా చెబుతున్నారు. 

వంద మందిలో, వరుసగా టాప్ 10లోని వ్యక్తులు:

1. కైలీ జెన్నర్, మోడల్ 
2. కాన్యే వెస్ట్, రాపర్
3. రోజర్ ఫెదరర్, టెన్నిస్ ప్లేయర్ 
4. క్రిస్టియానో ​​రొనాల్డో, ఫుట్ బాల్ ఆటగాడు
5. లియోనెల్ మెస్సీ, ఫుట్‌బాల్ క్రీడాకారుడు
6.టైలర్ పెర్రీ, నటుడు-హాస్యనటుడు
7.నేమార్, ఫుట్ బాల్ ఆటగాడు
8.హోవార్డ్ స్టెర్న్, రేడియో వ్యక్తిత్వం
9. లెబ్రాన్ జేమ్స్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు
10. డ్వేన్ జాన్సన్, నటుడు