Unstoppable : తెలుగు సినిమా ప్రత్యేకత గురించి చెప్పిన అగ్ర నిర్మాతలు

బాలకృష్ణ అన్ని పరిశ్రమలలో కంటే తెలుగు సినిమా ప్రత్యేకత ఏంటి అని ఇద్దర్ని నిర్మాతల్ని అడిగారు. సురేష్ బాబు మాట్లాడుతూ...............

Unstoppable : తెలుగు సినిమా ప్రత్యేకత గురించి చెప్పిన అగ్ర నిర్మాతలు

allu aravind and suresh babu comments on telugu movies

Unstoppable :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

Suresh Babu : వెంకటేష్ కి రెమ్యునరేషన్ ఇవ్వను.. ఆస్తి విడగొట్టలేదు కానీ..

ఇక ఈ ఎపిసోడ్ లో అనేక సినిమా విషయాల గురించి మాట్లాడారు. బాలకృష్ణ అన్ని పరిశ్రమలలో కంటే తెలుగు సినిమా ప్రత్యేకత ఏంటి అని ఇద్దర్ని నిర్మాతల్ని అడిగారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. తెలుగు సినిమా థాలీ మీల్స్ లాంటిది. ఇందులో అన్ని ఉంటాయి. రీమేక్, ఒరిజినల్ ఏదైనా ప్రేక్షకుడికి నచ్చాలి అని అన్ని హంగులతో తీస్తాం అని చెప్పారు. అల్లు అరవింద్ దీని గురించి మాట్లాడుతూ.. 100, 150 ఇచ్చి సినిమాకి వచ్చే వాళ్లకి మనం సంతృప్తి ఇస్తాం. హమ్మయ్య డబ్బులకి న్యాయం జరిగింది అనుకునేలా చేస్తాం. తెలుగు సినిమాకి ఆదరణ అందుకే ఎక్కువ అని తెలిపారు.