Allu Arjun : నో టెన్షన్.. టాక్స్ నడుస్తున్నాయ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ సినిమాలు లైనప్ చేస్తున్నారు..

Allu Arjun : నో టెన్షన్.. టాక్స్ నడుస్తున్నాయ్..

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 1 రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉంది. దీంతో బన్నీ తర్వాతి సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అభిమానుల్లో నెలకొంది. బోయపాటి శ్రీను, పరశురామ్, ప్రశాంత్ నీల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Mokshagna : వారసుడొస్తున్నాడు.. బాలయ్య షో లో మోక్షజ్ఞ..

‘కె.జి.యఫ్’ తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. వెంటనే ప్రభాస్‌తో ‘సలార్’, తర్వాత ఎన్టీఆర్, చరణ్‌లతో సినిమాలున్నాయి. దాని తర్వాత బన్నీతోనూ మూవీ చెయ్యాల్సి ఉంది. ఎటు తిరగి బోయపాటి సినిమాకి కాస్త టైం పట్టేలా ఉంది. తనకు ‘సరైనోడు’ లాంటి మాస్ హిట్ ఇచ్చిన బోయపాటితో మరో సినిమా చెయ్యడానికి బన్నీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు.

Naga Chaitanya : ఐ లవ్ వర్కౌట్స్ అంటున్న చై..

ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ తీస్తున్న పరశురామ్ కూడా బన్నీకి కథ చెప్పాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘శ్రీరస్తు శుభమస్తు’, గీతా ఆర్ట్స్ అనుంబంధ సంస్థ జిఎ2 పిక్చర్స్‌లో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పరశురామ్ మరోసారి అల్లు కాంపౌండ్‌లో సినిమా చెయ్యబోతున్నాడనే మాట గట్టిగానే వినిపిస్తోంది.

Pushpa Movie : సుకుమార్ కోసం మేకప్‌మెన్‌గా మారిన అల్లు అర్జున్!