Anasuya : దానికోసం గుండు కొట్టించుకోడానికి కూడా రెడీ : అనసూయ

పుష్ప' సినిమాలో దాక్షాయణి గా అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. విలనిజం చూపిస్తున్న ఈ లుక్

Anasuya : దానికోసం గుండు కొట్టించుకోడానికి కూడా రెడీ : అనసూయ

Anasuya

Anasuya :  అనసూయ తన యాంకరింగ్ తో, తన అందాల ఆరబోతతో టీవీలోనూ, సినిమాల్లోనూ అలరిస్తూ అభిమానులని పెంచుకుంటుంది. ఒక పక్క టీవీ షోలతో బిజీగా ఉంటూనే సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ అందర్నీ మెప్పిస్తుంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా తన యాక్టింగ్ తో అదరగొట్టిన అనసూయ ఇప్పుడు ‘పుష్ప’లో దాక్షాయణిగా మంచి మాస్ లుక్ లో రాబోతుంది. నిన్న ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణి గా అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. విలనిజం చూపిస్తున్న ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Khiladi : ఫిబ్రవరిలో ‘ఖిలాడీ’ ఆట షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయ అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో ఆస్క్‌మీ ఎనీథింగ్‌ సెషన్‌ నిర్వహించింది అనసూయ. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

Bigg Boss 5 : బిగ్ బాస్ హోటల్.. పీక్స్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్

ఈ సెషన్లో ఓ నెటిజన్‌ పెద్ద సినిమాలో మంచి రోల్‌ వస్తే, అవసరం అయితే ఆ పాత్ర కోసం గుండు కొట్టించుకోవాల్సి వస్తే కొట్టించుకుంటారా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తప్పకుండా కొట్టించుకుంటాను. క్యారెక్టర్‌ కోసం అవసరం అయితే గుండు కొట్టించుకోవడానికి వెనకాడను అంటూ అనసూయ ఓపెన్‌ గా చెప్పేసింది. అనసూయకి సినిమా మీద ఉన్న డెడికేషన్ మనకి తెలిసిందే. సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేస్తుంది. ఈ ఆన్సర్ తో మరోసారి తనకు యాక్టింగ్ పైన, సినిమా పైన ఉన్న ఇష్టాన్ని తెలియచేసింది ఈ జబర్దస్త్ భామ.