Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్‌బాస్‌ గెలుపు కోసం ఆటో తోలిన రవి

తాజాగా యాంకర్‌ రవి సింగర్‌ శ్రీరామ్‌ కోసం అతనికి ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. బిగ్ బాస్ టైటిల్‌ శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు. ఇందుకోసం ఆటోను....

Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్‌బాస్‌ గెలుపు కోసం ఆటో తోలిన రవి

Anchor Ravi

Bigg Boss 5 :  బిగ్‌బాస్‌ ఆఖరి వారంలో ఉండటంతో లోపల ఉన్న 5గురు కంటెస్టెంట్స్ కప్పు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరి కోసం బయట చాలా మంది ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అభిమానాలు, సెలబ్రిటీలతో పాటు ముందే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ ప్రమోషన్స్ ని వినూత్నంగా చేస్తున్నారు.

Samantha : సమంతపై వచ్చే పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

తాజాగా యాంకర్‌ రవి సింగర్‌ శ్రీరామ్‌ కోసం అతనికి ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. బిగ్ బాస్ టైటిల్‌ శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు. ఇందుకోసం ఆటోను కూడా నడిపాడు రవి. రోడ్ మీద ఒక ఆటో తీసుకొని ‘అన్నపూర్ణ స్టూడియో హౌస్‌, బిగ్‌బాస్‌ హౌస్‌, బిగ్‌బాస్‌ హౌస్‌..’ అని అరుస్తూ ఆటో తోలాడు. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి’ అంటూ ఆటో నడుపుతూ ప్రమోషన్స్ చేశాడు. ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్‌ కూడా వేశారు. ఇక ఈ వినూత్న ప్రచారం చూసి యాంకర్‌ రవిని శ్రీరామ్ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.

Genelia : జెనీలియా రీఎంట్రీ.. భర్త దర్శకత్వంలోనే..

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన శ్రీరామ్ అభిమానులు యాంకర్ రవి బిగ్ బాస్ నుంచి వెళ్ళేటప్పుడు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ వీడియో షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి వెళ్ళేటప్పుడు రవి శ్రీరామ్ తో… ‘నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా’ అని చెప్పాడు. ఇప్పుడు ఇది నిజం చేస్తున్నాడు అంటూ రవిని మెచ్చుకుంటున్నారు.