Anchor Suma : షోలో కన్నీళ్లు పెట్టుకుంటూ.. యాంకరింగ్ కి విరామం ప్రకటించిన సుమ..

తాజాగా ఓ షోలో తాను యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది సుమ. ఓ టీవీ ఛానల్ లో న్యూ ఇయర్ కి టెలికాస్ట్ కానున్న స్పెషల్ ప్రోగ్రాంలో సుమ పాల్గొంది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమోని విడుదల చేశారు. దీంట్లో సుమకి మిగిలిన ఆర్టిస్టులంతా............

Anchor Suma : షోలో కన్నీళ్లు పెట్టుకుంటూ.. యాంకరింగ్ కి విరామం ప్రకటించిన సుమ..

Anchor Suma giving break to anchoring

Anchor Suma :  రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ అంటే తెలియనివాళ్ళు ఎవరూ ఉండరు. దాదాపు 15 ఏళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది. తన మాటలతో, తన పంచులతో, తన కామెడీతో టీవీ షోలలో అలరిస్తూ తెలుగు ప్రజలందరికి నచ్చేసింది. మలయాళంలో పుట్టినా అచ్చ తెలుగు మాటలతో స్టార్ మహిళగా తెలుగు మహిళల్లో ఒకరిగా నిలిచిపోయింది.

టీవీ షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు ఉన్నా అందరికి సుమే కావాలి. సుమకి డేట్స్ ఖాళి లేకపోతే సినిమా ఈవెంట్లని కూడా వాయిదా వేసుకున్న రోజులు ఉన్నాయి. అంతగా సుమ ప్రేక్షకులనే కాదు సినీ, టీవీ పరిశ్రమ వాళ్ళని కూడా కట్టిపడేసింది. ప్రస్తుతం క్యాష్ షోతో పాటు పలు టీవీ షోలలో కనిపిస్తూ అటు సినిమా ఈవెంట్స్, ఇటు యూట్యూబ్ ఛానల్ తో కూడా బిజీగా ఉంది.

తాజాగా ఓ షోలో తాను యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది సుమ. ఓ టీవీ ఛానల్ లో న్యూ ఇయర్ కి టెలికాస్ట్ కానున్న స్పెషల్ ప్రోగ్రాంలో సుమ పాల్గొంది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమోని విడుదల చేశారు. దీంట్లో సుమకి మిగిలిన ఆర్టిస్టులంతా కలిసి సన్మానం చేశారు. సన్మానంలో సుమ మాట్లాడుతూ.. మళయాళీగా పుట్టిన నేను తెలుగులో ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి తెలుగు ప్రజలే కారణం కానీ ప్రస్తుతానికి నేను కొంత విరామం తీసుకుంటున్నాని అని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఈ ప్రొమో వైరల్ గా మారింది.

Vijay : 1990లో ఆ నటుడు నాకు గట్టి పోటీ ఇచ్చాడు.. విజయ్!

సుమ యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తుందా? ఇస్తే ఎందుకు? యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చి ఏం చేస్తుంది అని అభిమానులు, ప్రేక్షకులు పలు ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. మరి దీనికి సుమ ఏమన్నా సమాధానం చెప్తుందేమో చూడాలి. లేదా ఇదే ప్రోగ్రాంలో ఏమన్నా చెప్పిందేమో తెలియాలంటే డిసెంబర్ 31 దాకా ఆగాల్సిందే. సుమ యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తుందని ప్రకటించడంతో పలువురు అభిమానులు, తెలుగు మహిళలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.