Anchor Suma : యాంకర్ సుమకి అరుదైన వ్యాధి.. షాక్ లో అభిమానులు

యాంకర్ సుమ ఒక విషయం బయటకి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తను ఎన్నో ఏళ్లుగా ఓ వ్యాధితో బాధపడుతున్నాను అని అభిమానులకి తెలిపింది.

10TV Telugu News

Anchor Suma :  తెలుగు ప్రజలకి పరిచయం అవసరం లేని పేరు సుమ కనకాల. దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తన యాంకరింగ్ తో చిన్నా, పెద్దా అందర్నీ అలరిస్తుంది సుమ. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ గా ఉంటూ ఫుల్ ఎనర్జీతో యాంకరింగ్ చేస్తుంది. ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకుల్లో పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఆమెని, ఆమె యాంకరింగ్ ని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉంటారు. సెలబ్రిటీల జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కొంతమందికి చెప్పుకోలేని కష్టాలు కూడా ఉంటాయి. కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా చెప్పుకోరు. కొంతమంది సన్నిహితులకు చెప్పుకుంటారు. తాజాగా యాంకర్ సుమ ఒక విషయం బయటకి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

MAA Elections : నేడే ‘మా’ ఎన్నికలు.. టాలీవుడ్ లో హడావిడి..

తను ఎన్నో ఏళ్లుగా ఓ వ్యాధితో బాధపడుతున్నాను అని అభిమానులకి తెలిపింది. దీంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నట్లు సుమ తెలిపింది. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో క‌ష్టాలు పడినట్లు చెప్పింది. ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకున్న ప్ర‌తిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాని బాధపడింది. కెరీర్ మొద‌లుపెట్టిన కొత్త‌ల్లో ముఖానికి మేక‌ప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియ‌క ఈ డ్యామేజ్ జ‌రిగిపోయింద‌ని, తర్వాత అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసాను కానీ అవ్వలేదు అని తెలిపింది.

MAA Elections : ఓటుకి రూ.25వేలు..! ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌పై సంచలన ఆరోపణలు

ఈ చ‌ర్మ స‌మ‌స్య కార‌ణంగా ఏదైనా గాయ‌మైతే అది త్వ‌ర‌గా త‌గ్గిపోద‌ని, ఆ గాయం మ‌రింత పెద్దదిగా అవుతుంద‌ని, ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చాలా ట్రై చేశాన‌ని, కానీ ఫ‌లితం లేకుండా పోయింద‌ని వివరించింది. ఇప్పుడు ఈ వ్యాధి త‌న శ‌రీరంలో భాగ‌మైపోయింద‌ని, ఇప్పుడు ఉన్న దాన్ని కాపాడుకోవ‌డం త‌ప్ప చేసేదేమి లేదని సుమ బాధపడింది. చాలా మంది సాధారణంగా మన శరీరంలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోన‌ని దాన్ని దాచిపెడతాం. కానీ అది మ‌న శరీరంలోనే ఉంటుంది అని తెలిసిన‌ప్పుడు దాన్ని అంగీక‌రించాలి. అప్పుడే మ‌నం సంతోషంగా ఉండ‌గ‌ల‌మ‌ని అభిమానులతో చెప్పింది యాంకర్ సుమ. ఎప్పుడూ అందర్నీ నవ్వించి ఎంతో ఎనర్జీగా ఉంటూ అందర్నీ ఎనర్జీగా ఉంచే సుమ ఇంత బాధపడుతుందా అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

×