Anil Ravipudi: అఖండను క్రాస్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఏ విషయంలో తెలుసా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఎఫ్3 సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంతో మనమందుకు వచ్చి అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి భారీ బడ్జెట్‌ను కోరుతున్నాడట.

Anil Ravipudi: అఖండను క్రాస్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఏ విషయంలో తెలుసా?

Anil Ravipudi Demands Huge Budget For NBK108

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ఎఫ్3 సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంతో మనమందుకు వచ్చి అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించగా, గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.

Release Date Locked For NBK108: బాలయ్య కూడా దూకుడు చూపిస్తున్నాడుగా.. అప్పుడే 108కి డేట్ ఫిక్స్..?

ఇక బాలయ్య కెరీర్‌లో 108వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కోసం ఓ విలక్షణమైన కథను రెడీ చేసినట్లుగా.. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని గెటప్‌లో చూపిస్తానంటూ అనిల్ రావిపూడి తెలపడంతో, ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి భారీ బడ్జెట్‌ను కోరుతున్నాడట. గతంలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ చిత్రానికంటే ఏకంగా రూ.15 కోట్ల భారీ బడ్జెట్‌ను అధికంగా డిమాండ్ చేస్తున్నాడట.

NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!

అఖండ చిత్రానికి బోయపాటి శ్రీను 60 కోట్ల బడ్జెట్‌ను వినియోగించాడు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి బాలయ్య 108వ సినిమా కోసం నిర్మాతలను ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్‌ను డిమాండ్ చేశాడట. ఇక పబ్లిసిటీ ఖర్చులు అదనంగా మరో రూ.10 కోట్లు కానున్నాయి. ఈ లెక్కన ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్‌ను వాడనున్నాడు. అంటే అఖండ సినిమా కంటే ఈ చిత్రానికి ఏకంగా రూ.15 కోట్ల అధిక బడ్జెట్‌ను కేటాయించాల్సిందిగా అనిల్ రావిపూడి డిమాండ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.