Anushka Shetty: ‘కూ’లో ఖాతా తెరిచిన స్వీటీ!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ మొదలు ఇన్ స్టా వరకు ఫాలోవర్లను పెంచుకోవడం కూడా అభిమానులు సెలబ్రిటీల క్రెడిట్ గా భావిస్తున్నారు. కాగా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా నెట్ వర్క్ సైట్ ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా కూ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Anushka Shetty: ‘కూ’లో ఖాతా తెరిచిన స్వీటీ!

Anushka

Anushka Shetty: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ మొదలు ఇన్ స్టా వరకు ఫాలోవర్లను పెంచుకోవడం కూడా అభిమానులు సెలబ్రిటీల క్రెడిట్ గా భావిస్తున్నారు. కాగా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా నెట్ వర్క్ సైట్ ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా కూ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్ యాప్ మధ్య ఉద్రిక్త వాతావరణంతో కూ యాప్ కు క్రమేపీ ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ జేజెమ్మ అనుష్క కూడా కూలో ఖాతా తెరిచింది. ఈ మేరకు అనుష్క స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. తాను కూడా ‘కూ’లో కాలుమోపానని, ఇకపై తన అప్ డేట్లను అభిమానులతో ‘కూ’ వేదికపైనా పంచుకుంటానని యాప్ లో వెల్లడించారు.

జేజెమ్మ ఫాలోయింగ్ గురించి.. స్వీటీకున్న అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు కదా.. అలా ఖాతా తెరిచి తొలి పోస్ట్ పెట్టిందో లేదో కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చిపడ్డారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇకపై స్వీటీ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుందన్నమాట.