Online Ticketing : ఆన్లైన్ టికెటింగ్ పై ఏపీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో, ఏపీలో సినిమా ఆన్లైన్ టికెటింగ్ పై బాగా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ దీనిని వ్యతిరేకిస్తూ స్పీచ్ మాట్లాడటంతో కొద్ది రోజులు ఇది పెద్ద వివాదంగా

Online Ticketing :  ఆన్లైన్ టికెటింగ్ పై ఏపీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

Ap Filim Chambar

Online Ticketing :  ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో, ఏపీలో సినిమా ఆన్లైన్ టికెటింగ్ పై బాగా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ దీనిని వ్యతిరేకిస్తూ స్పీచ్ మాట్లాడటంతో కొద్ది రోజులు ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, ఏపీ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఎక్కువ మంది సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. తాజాగా ఏ.పి. ఫిలిం ఛాంబర్ తరుపున సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఏ.పి ఛాంబర్ ప్రెసిడెంట్ అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ.. సినిమా టికెట్స్ ధరల విషయంలో థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానం మంచిదని, ఆ విధానాన్ని అమలుచేయమని ఛాంబర్ తరుపున ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ను అడుగుతున్నామని అది ఇప్పుడు ఏ.పి. గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లడం మంచి పరిణామం అని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వై.యస్. జగన్మోహన్ రెడ్డికి ఛాంబర్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Pooja Hegde : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే

ఛాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ… ఇప్పటికే ఎ,బి సెంటర్స్ లో చాలా థియేటర్స్ లో ఆన్లైన్ విధానం వుందని మిగతా థియేటర్స్ లో కూడా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అంతా ట్రాన్సపరెంట్ గా ఉండి ఎక్కడా వివాదాలు తలెత్తవని అన్నారు. ఆన్లైన్ విధానం ప్రభుత్వ అదీనంలో ఉండటం తప్పు కాదని, కానీ కలెక్షన్స్ మాత్రం ఎప్పటికప్పుడు థియేటర్స్ కు ఇస్తే అప్పుడే ఎవరికి ఇబ్బంది ఉండదని కోరారు.

అంతే కాక ఫిలిం ఛాంబర్ ఆన్లైన్ విధానాన్ని స్వాగతిస్తుందని, కానీ బి, సి సెంటర్ లలో టికెట్స్ రేట్స్ విషయంలో మరో సారి ప్రభుత్వం ఆలోచించాలి అని అన్నారు. మనకు ఏదైనా సమస్య ఉంటే గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసి పరిష్కరించుకోవాలి కానీ గొడవపడి వివాదం చేస్తే పనులు జరగవని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ స్పీచ్ కి కౌంటర్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి, మంత్రి పేర్ని నానీకి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.