Arjun Das : పవన్ OG కోసం తమిళ్ స్టార్.. ఏ పాత్రకో??

ఇప్పటికే OG సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ తో మరింత హైప్ నెలకొంది. OG సినిమాలో ఇటీవల తమిళ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ ని తీసుకున్నట్టు ప్రకటించారు.

Arjun Das : పవన్ OG కోసం తమిళ్ స్టార్.. ఏ పాత్రకో??

Arjun Das tamil star plays a key role in Pawan Kalyan OG Movie

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమా షూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ రాబోయే సినిమాల్లో అభిమానులు OG సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టారు.

ఇప్పటికే OG సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ తో మరింత హైప్ నెలకొంది. OG సినిమాలో ఇటీవల తమిళ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ ని తీసుకున్నట్టు ప్రకటించారు. అర్జున్ దాస్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు వెల్కమ్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతూనే ఫుల్ ఖుషి అవుతున్నారు.

Varun – Lavanya Engagement : వరుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫొటోలు..

అర్జున్ దాస్ చాలా తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అతని వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. అతని వాయిస్ లో ఉండే బేస్ తో చాలా గంభీరంగా మాట్లాడుతుంటే ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఇటీవల తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ OG సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అయితే అర్జున్ దాస్ ని ఏ పాత్ర కోసం తీసుకున్నారో అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే విలన్ గా అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు, అప్పుడు మరింత హైప్ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి OG సినిమా నుంచి వరుస అప్డేట్స్ తో పవన్ అభిమానుల్లో హైప్ ని పెంచుతున్నారు.